Mahesh Babu: వారణాసి నా హృదయానికి చాలా దగ్గరైన సినిమా అన్నాడు సూపర్ స్టార్ మహేష్ బాబు. ఆయన హీరోగా అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమా గురించి ప్రపంచ దేశాలలో ఉన్న మహేష్ అభిమానులే కాకుండా, సినీ లవర్, ప్రేక్షకులు, సినీ ప్రముఖులందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 2027, ఏప్రిల్ 7వ తేదీ ఎప్పుడొస్తుందా..! అని అందరూ క్యాలెండర్స్ తిరగేస్తున్నారు.
దర్శక ధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి ఈసారి పాన్ వరల్డ్ స్థాయిలో వారణాసి చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. ఇప్పటి వరకూ ఒక్క గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్‌లో వదిలిన గ్లింప్స్ తప్ప, ఇంకే అప్‌డేట్‌ని పంచుకోలేదు. కానీ, సినిమాకి సంబందించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలను మాత్రం రివీల్ చేస్తూ వస్తున్నాడు. ఇటీవల, వారణాసి కథ-అందులో మహేష్ పాత్రను చెప్పి అందరిలో ఆసక్తిని రెట్టింపు చేశాడు.
ఇక, ఆగస్టు 9న మహేష్ పుట్టినరోజు సందర్భంగా ఆఫ్రికాలో షూట్ చేసిన సమయంలో తీసిన రెండు ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసి బర్త్ డే విషెస్ చెప్పాడు తప్ప..అందరూ ఆశించినట్టుగా మాత్రం విజువల్ ట్రీట్ ఇవ్వలేదు. అయినా, ఇది పాజిటివ్‌గా తీసుకున్నారు. ఇక, మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా సినీ ప్రముఖులందరూ ఆయనకి శుభాకాంక్షలు తెలిపారు. వారందరికీ, ధన్యవాదములు తెలిపాడు.

అంతేకాదు, సోషల్ మీడియాలో ఒక నోట్ కూడా రిలీజ్ చేశాడు. ఇందులో మహేష్..తన పుట్టినరోజుకి అందరూ చూపించిన ప్రేమకు మహేష్ ముగ్ధుడు అయ్యాడు. మీరందరూ గర్వించదగేలా పని చేస్తానని ప్రామిస్ చేసాడు కూడా.
అలాగే, నేను ఇప్పుడు చేస్తున్న ఎపిక్ వరల్డ్ సినిమా ‘వారణాసి’. ఈ సినిమా నా హృదయానికి చాలా దగ్గరైనది. ఖచ్చితంగా ఈ చిత్రం ఒక ప్రత్యేకమైనదిగా నిలుస్తుందని భావిస్తున్నాను. ఆ ఎక్స్పీరియన్స్ ని మీకు అందించడానికి ఆగలేకపోతున్నాను.. అని రాసుకొచ్చాడు. ఇప్పుడీ ప్రెస్ నోట్ అంతటా వైరల్ అవుతోంది.












