Trisha Krishnan: సీనియర్ హీరోయిన్స్‌లో నయనతార, తమన్నా, త్రిష కృష్ణన్‌లకి అదే క్రేజ్ కొనసాగుతోంది. తెలుగు, తమిళ, హిందీ సినిమాలలో వీరికి మంచి అవకాశాలు దక్కుతున్నాయి. నయన్ ప్రస్తుతం వరుస ప్రాజెక్ట్స్‌తో బిజీగా ఉంది. హిందీలో సల్మాన్ సరసన నటిస్తోంది. తెలుగులో బాలయ్య సరసన ఒక సినిమాను చేస్తోంది. ఇవి, కాకుండా టాక్సిక్ లో కీలక పాత్రను పోషించింది. మరికొన్ని సెట్స్‌పై, ఇంకొన్ని చర్చల దశలో ఉన్నాయి.
నయన్ డేట్స్ కుదరక త్రిషకి ఛాన్స్?
ఇలా, నయనతార వరుస సినిమాలతో బిజీగా ఉండటంతో కార్తి హీరోగా రూపొందబోయో సినిమాకి డేట్స్ సర్దుబాటు చేయలేకపోతుందట. దాంతో, ఆ ఛాన్స్ త్రిషకి దక్కినట్టుగా తెలుస్తోంది. గతంలో కార్తి సరసన త్రిష పొన్నియన్ సెల్వన్ మూవీలో నటించిన సంగతి తెలిసిందే. మణి రత్నం దర్శకత్వం వహించాడు. ఇందులో, కార్తి-త్రిష..వందియదేవన్-కుందవై పాత్రల్లో బాగా ఆకట్టుకున్నారు.
స్క్రీన్ మీద వీళ్ళ ప్రజెన్స్ కూడా చక్కగా కుదిరింది. దాంతో, మోహన్ రాజా దర్శకత్వంలో కార్తి తన 31వ సినిమాను చేయబోతున్నాడు. ఈ సినిమాలో ముందు నయనతారని అనుకున్నప్పటికీ, ఇప్పుడు త్రిష పేరును పరిశీలిస్తున్నారట. ఈమె డేట్స్ గనక కుదిరితే ప్రాజెక్ట్‌లోకి తీసుకోనున్నట్టుగా కోలీవుడ్ ఫిల్మ్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. ప్రస్తుతం, పి.ఎస్. మిత్రన్ దర్శకత్వంలో ‘సర్దార్ 2’ చేస్తున్నాడు కార్తి. సెప్టెంబర్ 10వ తేదీన ఈ సినిమా రిలీజ్ కానుంది.

విశ్వంభర తో తెలుగులో త్రిష కంబ్యాక్:
త్రిష చాలాకాలం తర్వాత మెగాస్టార్ చిరంజీవి సరసన సోషియో ఫ్యాంటసీ మూవీ విశ్వంభరలో హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాను అక్టోబర్‌లో రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. బింబిసార ఫేమ్ మల్లిడి వశిష్ట దర్శకత్వం వహిస్తున్నాడు. ఎం.ఎం.కీరవాణి సంగీతం అందిస్తున్నాడు. విశ్వంభర గనక హిట్ అయితే, మళ్ళీ త్రిషకి తెలుగులో అవకాశాలు రావచ్చు.












