Spirituality

Spirituality: శ్రావణ మాసం విశిష్టత గురించి శాస్త్రాలు ఏం చెబుతున్నాయంటే!..

రచన: Venu4 నిమిషాల పఠనం

శ్రావణ మాసంలో అత్యంత ప్రాముఖ్యత పొందిన పర్వదినం వరలక్ష్మీ వ్రతం. శ్రావణ పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం ఈ వ్రతాన్ని ఆచరించడం హిందువుల ఆనవాయితీ. లక్ష్మీదేవిని ఆరాధిస్తూ కుటుంబ సౌభాగ్యం, ఐశ్వర్యం, శాంతి కోసం ప్రార్థిస్తారు.

హిందూ సంప్రదాయంలో శ్రావణ మాసానికి ఎంతో విశిష్టమైన స్థానం ఉందని పండితులు అంటారు. వర్షాకాలంలో వచ్చే ఈ పవిత్రమైన మాసం పరమశివుడు, శ్రీమహావిష్ణువు, లక్ష్మీదేవి, గౌరీదేవి ఆరాధనకు ప్రత్యేకమైనదిగా.. అలాగే పూజలు, వ్రతాలు, దానధర్మాలకు అనుకూలమైన కాలంగా భావిస్తారు.

ఇక శ్రావణ మాసంలోని సోమవారాలు పరమశివుని ఆరాధనకు ప్రత్యేకం. భక్తులు శివలింగానికి అభిషేకం చేసి, బిల్వపత్రాలతో పూజలు నిర్వహిస్తారు. సోమవార వ్రతాన్ని భక్తిశ్రద్ధలతో ఆచరించడం వల్ల శివానుగ్రహం లభిస్తుందని విశ్వాసం.,ఇక శ్రావణ మంగళవారాల్లో మంగళ గౌరీ వ్రతం ఆచరించే సంప్రదాయం ఉంది.

ముఖ్యంగా వివాహిత స్త్రీలు గౌరీదేవిని పూజిస్తూ సౌభాగ్యం, కుటుంబ క్షేమం కోసం ప్రార్థిస్తారు. అలాగే శ్రావణ మాసంలో అత్యంత ప్రాముఖ్యత పొందిన మరో పర్వదినం వరలక్ష్మీ వ్రతం. శ్రావణ పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం ఈ వ్రతాన్ని ఆచరించడం హిందువుల ఆనవాయితీ. లక్ష్మీదేవిని ఆరాధిస్తూ కుటుంబ సౌభాగ్యం, ఐశ్వర్యం, శాంతి కోసం ప్రార్థిస్తారు.

మరోవైపు శ్రావణ శనివారాల్లో శ్రీ వెంకటేశ్వర స్వామిని పూజించడం, దీపారాధన చేయడం కూడా అనేక ప్రాంతాల్లో సంప్రదాయంగా కొనసాగుతోంది. ఇక ఈ మాసంలో ఉదయాన్నే స్నానం చేసి, ఇంటిని శుభ్రంగా ఉంచి, పూజలు, నామస్మరణ, జపం, ధ్యానం చేయడం శ్రేయస్కరంగా భావిస్తారు. పేదలకు అన్నదానం, వస్త్రదానం, తాంబూలం ఇవ్వడం వంటి దానధర్మాలకు కూడా ఈ మాసంలో ప్రత్యేక ప్రాధాన్యం ఉంది.

అలాగే శ్రావణంలో సాధ్యమైనంత వరకు సాత్విక ఆహారం తీసుకోవడం, ఇంద్రియ నియమాన్ని పాటించడం మంచిదని ఆధ్యాత్మిక సంప్రదాయం చెబుతుంది. అయితే కొన్ని విషయాలు ప్రాంతం, కుటుంబ ఆచారం, సంప్రదాయం ఆధారంగా మారుతాయి. మాంసాహారం, మద్యం వంటి వాటిని వర్జించడం అనేక భక్తుల ఆచారం. అలాగే కోపం, కలహాలు, ఇతరులను నిందించడం, చెడు ఆలోచనలకు దూరంగా ఉంటూ ప్రశాంతంగా గడపాలని మన పెద్దలు సూచిస్తారు.

అయితే శ్రావణ మాసం అంటే కేవలం పూజలు, వ్రతాలు మాత్రమే కాదు. మనసును శుద్ధి చేసుకోవడం, దైవస్మరణతో జీవించడం, ఇతరులకు సహాయం చేయడం, ధర్మబద్ధమైన జీవనాన్ని ఆచరించడమే ఈ పవిత్ర మాసం యొక్క అంతరార్థంగా శాస్త్రాలు చెబుతున్నాయి..

గమనిక: ఇక్కడ అందించిన వివరాలు కేవలం సాంప్రదాయ పురాణ విశ్వాసాలు మరియు ఆధ్యాత్మిక భావనల ఆధారంగా ఇవ్వబడ్డాయి. వీటిని కేవలం మతపరమైన విశ్వాసాల కోణంలోనే చూడాలి. వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునే ముందు సంబంధిత రంగ నిపుణులను సంప్రదించడం మంచిది.

#Spirituality#Indian Culture#Shravanam#month#Lord#Shiva#Maha Vishnu#Lakshmi#Gauri
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి