సినిమా

Varanasi: శ్రీరాముడిగా మహేష్ బాబు, హనుమంతుడిగా రామ్ చరణ్‌?

రచన: Anshu4 నిమిషాల పఠనం

Varanasi: శ్రీరాముడిగా మహేష్ బాబు, హనుమంతుడిగా రామ్ చరణ్‌..ఈ మాట వింటేనే ఒళ్ళు పులకరించిపోతుంది. అవును ప్రస్తుతం దీనికి సంబందించిన వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అసలు, ఈ వార్త రావడానికి కారణం ఎవరు..ఏ సినిమా. ఇద్దరు సూపర్ స్టార్స్ కలిసి బిగ్ స్కేల్ లో కనిపిస్తే ఆ ఇమాజినేషన్ ఊహాజనితం. అలాంటి ఓ క్రేజీ న్యూస్ గురించి పూర్తి వివరాల్లోకి వెళ్ళి తెలుసుకుందాం.

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న పాన్ వరల్డ్ సినిమా వారణాసి. దర్శక ధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. మహేష్ బర్త్ డే సందర్భంగా వదిలిన పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. అలాగే, వారణాసి కథా గమనం, అందులో మహేష్ పోషించేటువంటి పాత్రలు, వాటి చిత్రీకరణ, ప్రాధాన్యం గురించి స్వయంగా రాజమౌళి వెల్లడించడం ఓ ఆసక్తిని తారాస్థాయిలో నిలిపింది.

ఇప్పుడు అంతకు మించిన వార్త అన్నీచోట్లా వైరల్‌గా మారింది. వారణాసి సినిమాలో ఒక ఎపిసోడ్ కోసం మహేష్ శ్రీరాముడి అవతారంలో కనిపించబోతున్నాడు. అయితే, ఇదే ఎపిసోడ్‌లో హనుమంతుడు కనిపిస్తాడట. ఈ పాత్రలో ముందు బహుబాషా నటుడు ఆర్.మాధవన్‌ని అనుకున్న రాజమౌళి ఇప్పుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌ ని హనుమంతుడిగా తీసుకునే ఆలోచనలో ఉన్నాడట.

ఇటీవల వచ్చిన పెద్ది సినిమాలో చరణ్ క్లైమాక్స్ లో హనుమంతుడి ప్రతీకగా నటించిన రౌద్రం, రౌద్ర రసంతో కూడిన పర్ఫార్మెన్స్ ఇటు ప్రేక్షకులను, అటు మెగా అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది. అది చూసి వారణాసి మూవీలోని ఈ కీలకమైన ఘట్టానికి హనుమంతుడి పాత్ర కోసం రామ్ చరణ్ ని తీసుకున్నట్టుగా సమాచారం. ఇదే, గనక రూమర్ కాకుండా నిజమైతే శ్రీరాముడిగా మహేష్ బాబును, హనుమంతుడిగా రామ్ చరణ్‌ను చూడటానికి రెండు కళ్ళూ సరిపోవనేది వెయ్యి శాతం నిజం. మరి, ఈ క్రేజీ న్యూస్ రూమర్‌గా మిగులుతుందా, నిజం చేస్తాడా రాజమౌళి చూడాలి.

#Varanasi#MaheshBabu#SSRajamouli#RamCharan
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి