తెలంగాణ

TG : వర్షాలు కురవాలని మొసలికి పూజలు.. (వీడియో వైరల్)

రచన: Kumar••3 నిమిషాల పఠనం

వర్షాలు కురవాలని కొందరు కప్పతల్లి వేషాలు వేస్తుంటారు. వాడవాడలా ఊరేగింపులు చేస్తుంటారు.కొందరైతే గాడిదలకు పెళ్లి చేసి ఊరేగిస్తుంటారు. ఇలా చేయడం వలన వర్షాలు కురుస్తాయని వారి నమ్మకం. అయితే, ఇవన్నీ మూఢనమ్మకాలు అని మరికొందరు కొట్టిపారేస్తుంటారు.

వర్షాలు కురవాలని కొందరు కప్పతల్లి వేషాలు వేస్తుంటారు. వాడవాడలా ఊరేగింపులు చేస్తుంటారు.కొందరైతే గాడిదలకు పెళ్లి చేసి ఊరేగిస్తుంటారు. ఇలా చేయడం వలన వర్షాలు కురుస్తాయని వారి నమ్మకం. అయితే, ఇవన్నీ మూఢనమ్మకాలు అని మరికొందరు కొట్టిపారేస్తుంటారు. ఇలాంటి ఘటనలు ఎక్కువగా గ్రామీణ ప్రాంతాల్లోనే జరుగుతుంటాయి. మరికొందరు అమ్మవార్లకు పూజలు చేసి మొక్కులు సమర్పిస్తుంటారు.వరుణదేవుడికి సైతం మరికొందరు పూజలు చేస్తుంటారు.

ఇదివరకు ఎన్నడూ చూడని విధంగా ఓ వ్యక్తి ఏకంగా మొసలికి పూజలు చేయడం కలకలం రేపింది. దాని మీద పూలు చల్లి పూజలు చేస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ఈ ఘటన జోగులాంబ గద్వాల జిల్లాలోని బీచుపల్లిలో వెలుగుచూసింది. వివరాల్లోకివెళితే..ఎగువన జూరాల ప్రాజెక్టు గేట్లు ఎత్తివేయడంతో వరద నీటిలో ఒక పెద్ద మొసలి కొట్టుకొచ్చింది.

​దాన్ని గమనించిన స్థానికులు పోలీస్, రెవెన్యూ అధికారులకు సమాచారం అందించారు. అటవీశాఖ సిబ్బంది మొసలిని సురక్షితంగా కాపాడారు. అనంతరం వారి అదుపులోకి తీసుకున్నారు. అయితే, అపరకర్మల భవనం వద్ద ఉన్న భక్తులు ఆ మొసలిని వరుణ దేవుని వాహనంగా భావించి పసుపు, పూలు చల్లి వరుణ దేవా కరుణించాలంటూ కుంకుమలతో ప్రత్యేక పూజలు చేశారు.

https://x.com/pulsenewsbreak/status/2086630611792417169?s=20

పురాణాల్లో మొసలికి ప్రత్యేక ఆధ్యాత్మిక ప్రాధాన్యత ఉందని పురోహితులు అనిల్ శర్మ పేర్కొన్నారు. పూజల అనంతరం అధికారులు మొసలిని తిరిగి కృష్ణా నదిలోనే సురక్షితంగా విడిచిపెట్టారు. అయితే, మొసలికి పూజలు చేయడం ఇప్పుడు జిల్లాలోనే హాట్ టాపిక్ అయ్యింది. మూఢనమ్మకాలతో జనాలను పిచ్చివాళ్లను చేయొద్దంటూ మరికొందరు నెట్టింట్ కామెంట్స్ చేస్తున్నారు.

#Crocodile#worship#gadwala district#krishna river
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి