తెలంగాణ

కాంగ్రెస్ నేతల దౌర్జన్యం.. వేధింపులు తాళలేక రైతు ఆత్మహత్యాయత్నం!

రచన: Mamatha puppala4 నిమిషాల పఠనం

మధిర నియోజకవర్గంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అనుచరుల వేధింపులు తాళలేక ఒక సామాన్య రైతు ఆత్మహత్యాయత్నానికి ఒడిగట్టిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఖమ్మం జిల్లా చింతకాని మండలం నాగులవంచ గ్రామానికి చెందిన జొన్నలగడ్డ మల్లికార్జున రావు అనే రైతు తన స్వంత భూమిని కాపాడుకునే క్రమంలో కాంగ్రెస్ స్థానిక నాయకుల చేతిలో నిత్యం వేధింపులకు గురయ్యాడు.

మధిర నియోజకవర్గంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అనుచరుల వేధింపులు తాళలేక ఒక సామాన్య రైతు ఆత్మహత్యాయత్నానికి ఒడిగట్టిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఖమ్మం జిల్లా చింతకాని మండలం నాగులవంచ గ్రామానికి చెందిన జొన్నలగడ్డ మల్లికార్జున రావు అనే రైతు తన స్వంత భూమిని కాపాడుకునే క్రమంలో కాంగ్రెస్ స్థానిక నాయకుల చేతిలో నిత్యం వేధింపులకు గురయ్యాడు. తీవ్ర మనస్తాపానికి గురైన మల్లికార్జునరావు పురుగుల మందు తాగి ప్రాణాపాయ స్థితికి చేరుకోవడంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు.

బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామంలో రోడ్డు నిర్మాణం పేరిట కాంగ్రెస్ మండల అధ్యక్షుడు, మార్కెట్ కమిటీ చైర్మన్ అంబటి వెంకటేశ్వరరావు, అతని వర్గీయులు ఉద్దేశపూర్వకంగానే తన భూమిని మాత్రమే లాక్కోవాలని చూస్తున్నారు. తన ఆస్తిని కాపాడుకోవడానికి ప్రయత్నించినందుకు తనపై భౌతిక దాడులకు పాల్పడటమే కాకుండా, ఎదురు తిరిగితే అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపుతామని తీవ్రస్థాయిలో బెదిరింపులకు దిగారు. 'మా వెనక భట్టి విక్రమార్క ఉన్నాడు.. నువ్వు ఏం పీక్కుంటావో పీక్కో' అంటూ తీవ్ర పదజాలంతో అహంకారం ప్రదర్శించారని రైతు ఆవేదన వ్యక్తం చేశాడు.

అధికార పార్టీ నాయకుల అండదండలతో స్థానిక నేతలు సాగిస్తున్న ఈ అక్రమాలు, దౌర్జన్యాలపై గ్రామంలో తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. ప్రజాప్రతినిధులు, అధికారులు న్యాయం చేయాల్సింది పోయి, అధికార బలం చూపి సామాన్య రైతులపై దౌర్జన్యంగా వ్యవహరించడం దారుణమని గ్రామస్థులు మండిపడుతున్నారు. మల్లికార్జున రావు కుటుంబానికి వెంటనే న్యాయం చేయాలని, దాడికి, బెదిరింపులకు పాల్పడిన వారిపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రైతు పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనతో మధిర నియోజకవర్గంలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. అధికార దుర్వినియోగానికి నిదర్శనంగా నిలిచిన ఈ ఉదంతంపై ఉన్నతాధికారులు నిష్పాక్షికంగా విచారణ జరిపి, బాధ్యులైన ఎంతటి వారైనా శిక్షించాలని, బాధితుడి భూమికి రక్షణ కల్పించాలని స్థానిక రైతాంగం కోరుతోంది.

 

వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి