కన్నడ హీరో దర్శన్ మరోసారి చిక్కుల్లో పడ్డారు. తన అభిమాని రేణుకాస్వామి హత్య కేసులో అరెస్టు అయ్యి జైలులో ఉన్న ఆయనకు కఠిన శిక్ష తప్పేలా లేదని తెలుస్తోంది. ఎందుకంటే రేణుకాస్వామి హత్యకేసులో ఏ-14గా ఉన్న నిందితుడు అప్రూవర్‌గా మారినట్టు తెలిసింది.దీంతో విచారణలో భాగంగా పోలీసులకు అసలు నిజాలను వెల్లడించినట్టు సమాచారం. రేణుకాస్వామి హత్య కేసులో A-14గా దర్శన్ అనుచరుడు ప్రదోష్ ఉన్నాడు.
విచారణలో ఆయన వెల్లడించిన నిజాలు ఇలా ఉన్నాయి. ‘పవిత్ర గౌడకు మెసేజ్‌లు పంపిన రేణుకాస్వామిని దర్శన్ బూతులతో దూషిస్తూ, తల నుంచి రక్తం వచ్చేలా కొట్టాడు.బట్టలూడదీసి దొస్తులతో కారుకు వేలాడదీసి దారుణంగా కొట్టాడు. ఆ తర్వాత దర్శన్ కాల్ చేయగా.. ఘటనా స్థలానికి వెళ్లి రేణుకాస్వామిని పవిత్ర గౌడ చెప్పుతో కొట్టింది. అనంతరం రేణుకాస్వామిని అండర్‌వేర్ మీద టాటా ఏస్‌కు వేలాడదీసి నైలాన్ తాడుతో విచక్షణా రహితంగా దాడి చేశారు.
అన్నం, నీళ్లు ఇచ్చిన తర్వాత ఛాతీ, మెడపై కాలితో దర్శన్ గట్టిగా తన్నాడు.దాంతో రేణుకాస్వామి స్పృహతప్పి పడిపోయాడు.ఆ తర్వాత రేణుకాస్వామి ఛాతీపై నిలబడి తొక్కేందుకు దర్శన్ ప్రయత్నించగా.. ఆయన్ను పక్కకు లాగి, రేణుకాస్వామి చనిపోయినట్లు గుర్తించాను’ అని విచారణలో దర్శన్ అనుచరుడు ప్రదోష్ తెలిపాడు.
https://x.com/TeluguScribe/status/2086675802847105495?s=20
హత్య విషయాన్ని సెటిల్ చేయకపోతే దర్శన్ గన్‌తో కాల్చుకొని చనిపోతానని అన్నాడని.. అందుకే కట్టుకథను అల్లడానికి చర్చలు జరిపామని ప్రదోష్ వాంగ్మూలం ఇచ్చాడు. తనకు తెలిసిన వివరాలు తెలిపానని.. తన రక్షణ కోసం దర్శన్ వాళ్లతో పాటు కాకుండా ప్రత్యేక సెల్‌లో ఉంచాలని పిటిషన్‌లో ప్రదోష్ పోలీసులను విజ్ఞప్తి చేసినట్టు తెలిసింది. ఈ పిటిషన్‌పై విచారణ అనంతరం కర్ణాటక హైకోర్టు తుది తీర్పును ఇవ్వనుంది.












