వ్యాపారం

GOlD : హమ్మయ్యా.. దిగొచ్చిన బంగారం, వెండి ధరలు!

రచన: Kumar••3 నిమిషాల పఠనం

పసిడి ప్రియులకు ఎట్టకేలకు ఊరట లభించింది. కొద్ది రోజులుగా ధరలు పెరుగుతూ కస్టమర్లకు చుక్కలు చూపిస్తున్న బంగారం, వెండి ఎట్టకేలకు దిగొచ్చింది. నిన్నటితో పోలిస్తే సోమవారం ఉదయం పసిడి, వెండి ధరల్లో స్వల్ప తగ్గుదల నమోదు అయ్యింది.ధరలు పెరుగుతుండటంతో వినియోగదారులు తీవ్ర ఆందోళన చెందారు.

పసిడి ప్రియులకు ఎట్టకేలకు ఊరట లభించింది. కొద్ది రోజులుగా ధరలు పెరుగుతూ కస్టమర్లకు చుక్కలు చూపిస్తున్న బంగారం, వెండి ఎట్టకేలకు దిగొచ్చింది. నిన్నటితో పోలిస్తే సోమవారం ఉదయం పసిడి, వెండి ధరల్లో స్వల్ప తగ్గుదల నమోదు అయ్యింది.ధరలు పెరుగుతుండటంతో వినియోగదారులు తీవ్ర ఆందోళన చెందారు.

తాజాగా ధరలు తగ్గడంతో పసిడి ప్రియులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్లలో చోటుచేసుకుంటున్న ఆర్థిక పరిణామాలు, డాలర్ మారకం విలువలో వస్తున్న వ్యత్యాసాల కారణంగానే స్థానిక మార్కెట్లలో బంగారం, వెండి ధరలలో మార్పులు చోటుచేసుకున్నట్టు సమాచారం. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు క్రమేణా తగ్గుముఖం పడుతుండటం కూడా బంగారం, వెండి ధరలు తగ్గడానికి సానుకూల పరిస్థితులను సృష్టించి ఉండొచ్చని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు.

ఇవాళ హైదరాబాద్‌లో మేలిమి బంగారం (24 క్యారెట్లు) 10 గ్రాముల ధర రూ.380 తగ్గి రూ.1,51,970 పలుకుతోంది. అలాగే ఆభరణాల తయారీకి ఉపయోగించే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.350 తగ్గగా ప్రస్తుతం రూ. 1,39,300గా ఉంది. ఇది అంతకుముందు రోజు నమోదైన రూ.1,39,650 కంటే రూ. 10 తక్కువ. ఇక వెండి సైతం పసిడి బాటలోనే నడుస్తోంది.

కేజీ వెండి ధర రూ.4,900 తగ్గముఖం పట్టగా.. హైదరాబాద్‌లో ప్రస్తుతం రూ.2,45,000 పలుకుతోంది. నిన్న కేజీ వెండి ధర రూ. 2,49,900తో పోల్చితే ఇది రూ.100 తగ్గుముఖం పట్టింది.ఇదిలాఉండగా, పలురాష్ట్రాల్లో ధరల్లో స్వల్ప మార్పులు ఉండొచ్చు. జీఎస్టీ యాడ్ చేస్తే ధరల్లో వ్యత్యాసం ఉంటుంది.

#gold#silver rates#decrease#hyderabad#bullion market
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి