తెలంగాణ

TG : ట్రాఫిక్‌లోనే 200 గంటలు.. నరకం చూస్తున్న హైదరాబాదీలు!

రచన: Kumar5 నిమిషాల పఠనం

హైదరాబాద్‌లోని ట్రాఫిక్ పుణ్యమా అని వాహనదారులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. అడుగు తీసి అడుగు వేయలేని దుస్థితికి నగరంలో ట్రాఫిక్ పెరిగింది. వర్షాకాలం వచ్చిందంటే చాలు నరకప్రాయమే. వాహనాలు ఆగిపోయాయంటే గంటల కొద్దీ వాహనదారులు, ప్రయాణికులు ట్రాఫిక్‌లో చిక్కుకోవాల్సిందే.

హైదరాబాద్‌లోని ట్రాఫిక్ పుణ్యమా అని వాహనదారులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. అడుగు తీసి అడుగు వేయలేని దుస్థితికి నగరంలో ట్రాఫిక్ పెరిగింది. వర్షాకాలం వచ్చిందంటే చాలు నరకప్రాయమే. వాహనాలు ఆగిపోయాయంటే గంటల కొద్దీ వాహనదారులు, ప్రయాణికులు ట్రాఫిక్‌లో చిక్కుకోవాల్సిందే. చిన్నా పెద్దా తేడా లేకుండా ట్రాఫిక్‌లో అవస్థలు పడాల్సిందే. అయితే, సగటున ఓ మనిషి హైదరాబాద్ ట్రాఫిక్‌లో ఎన్ని గంటలు వెయిట్ చేయాల్సి వస్తుందో తెలిస్తే షాక్ అవుతారు.

సగటు హైదరాబాదీ ఏడాదికి 200 గంటల విలువైన తన సమయాన్ని కేవలం రోడ్ల మీద, వాహనాల రద్దీ మధ్యే గడిపేస్తున్నాడని తాజా ట్రాఫిక్ ఇండెక్స్ సర్వే తెలిపింది. ఈ సర్వే వాస్తవాలు పలువురిని ఆందోళనకు గురిచేస్తున్నాయి. హైదరాబాద్ మహానగరం వేగంగా విస్తరిస్తోంది. సిటీలో స్థలం లేకపోవడంతో ఓఆర్ఆర్ నుంచి ట్రిపుల్ ఆర్ వరకు సర్కారు కొత్తగా ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నది. ఈ ప్రాంతంలో ఇకమీదట భవిష్యత్ అవసరాల కోసం పరిశ్రమలు, మౌలికసదుపాయాలు, రేడియల్ రోడ్లను విస్తరించేందుకు సర్కారు కసరత్తు చేస్తున్నది.

ఇప్పటికే వలసల కారణంగా నగరంలో జనాభా భారీగా పెరిగిపోయింది.వాహనాల సంఖ్య కూడా రోజురోజుకూ పెరిగిపోతోంది.ఆ రద్దీని తట్టుకునే స్థాయిలో రోడ్ల విస్తరణ జరగడం లేదు. ఎన్ని కొత్త ఫ్లైఓవర్లు, అండర్ పాస్‌లు కడుతున్నా ట్రాఫిక్ కష్టాలకు పూర్తి స్థాయి పరిష్కారం దొరకడం లేదు. ఏటా లక్షలాది కొత్త వాహనాలు రోడ్డెక్కుతుండటం, దానికి తగ్గట్టుగా ట్రాఫిక్ మేనేజ్మెంట్ వ్యవస్థ మెరుగుపడకపోవడం వల్లే వాహనదారులు గంటల తరబడి రోడ్లపైనే చిక్కుకుపోవాల్సి వస్తోంది.

ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు.. మళ్లీ సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు రోడ్లపై నరకం చూడాల్సి వస్తోందని వాహనదారులు చెబుతున్నారు. దీంతో ఏటా 200 గంటలు.. దాదాపు 8 రోజులకు పైగా విలువైన సమయం కేవలం శబ్దకాలుష్యం, వాయు కాలుష్యం మధ్యే గడపాల్సి వస్తోందని బాధపడుతున్నారు.దీనివల్ల సమయమే కాదు.. ప్రజల ఆరోగ్యం కూడా దెబ్బతింటోంది. వాయుకాలుష్యంతో నగరవాసులు.. వాహనాలు నడుపుతూ వాహనదారులు అనారోగ్య సమస్యలు కొని తెచ్చుకుంటున్నారు. గంటల తరబడి బండి లేదా కారులో కూర్చుని క్లచ్, బ్రేకులు తొక్కుతూ ఉండటం వల్ల విపరీతమైన నడుము నొప్పులు, వెన్నెముక, మెడ నొప్పుల బారిన పడుతున్నారు.శారీరక, మానసిక ఒత్తిడి వల్ల కంటి నిండా నిద్ర కూడా ఉండటం లేదని సర్వే స్పష్టంచేస్తోంది.కలుషిత గాలి పీల్చడం వల్ల ఆస్తమా, అలర్జీల వంటి శ్వాసకోశ వ్యాధులు పెరుగుతున్నాయని వైద్యనిపుణులు చెబుతున్నారు.

#200 hours#stuck#hyderbad traffic#telangan#vehicles rush
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి