International

America: ఎన్నికల ఎఫెక్ట్‌.. ఇరాన్‌ విషయంలో ట్రంప్‌ యూటర్న్‌!?..

రచన: Venu5 నిమిషాల పఠనం

ఓవైపు తరిగిపోతున్న ఆయుధ నిల్వలు.. మరోవైపు మధ్యంతర ఎన్నికలు.. ఇటు ఇరాన్‌తో ఎంతకీ తెగని చర్చలతో ట్రంప్‌ సర్కార్‌ నలిగిపోతోంది. పశ్చిమాసియాలో సుదీర్ఘ యుద్ధంతో లాభం కంటే నష్టమే ఎక్కువ కన్పిస్తుండటంతో సొంత దేశంలోనే అధ్యక్షుడు ట్రంప్‌ విషయంలో వ్యతిరేకత మొదలైంది.

అమెరికాలో మధ్యంతర ఎన్నికలు దగ్గరపడుతున్నాయి. ఈ ఏడాది నవంబరులో అక్కడ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఇప్పటికే తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటున్న ట్రంప్ లో.. ఈ ఎన్నికల్లో ఎలాంటి ఫలితాలు చవిచూడవలసి వస్తుందో అనే టెన్షన్ మొదలైనట్టుందని తెలుస్తుంది.

అమెరికా అధ్యక్షుడిగా ఎప్పుడు వివాదాస్పదమైన నిర్ణయాలతో ముందుకు వెళ్తున్న ఆయన తీసుకున్న నిర్ణయాల వల్ల.. ప్రస్తుతం దేశంలో ఆర్థికమాధ్యం నెలకొంటుందని నిపుణులు హెచ్చరిస్తున్న క్రమంలో ఇరాన్‌తో డీల్‌ విషయంలో.. ట్రంప్‌ యూటర్న్‌తీసుకున్నారా? అనే సందేహాలు కలుగుతున్నాయి..

ఇప్పటికే ఓవైపు తరిగిపోతున్న ఆయుధ నిల్వలు.. మరోవైపు మధ్యంతర ఎన్నికలు.. ఇటు ఇరాన్‌తో ఎంతకీ తెగని చర్చలతో ట్రంప్‌ సర్కార్‌ నలిగిపోతోంది. పశ్చిమాసియాలో సుదీర్ఘ యుద్ధంతో లాభం కంటే నష్టమే ఎక్కువ కన్పిస్తుండటంతో సొంత దేశంలోనే అధ్యక్షుడు ట్రంప్‌ విషయంలో వ్యతిరేకత మొదలైంది. ఈ క్రమంలో యుద్ధం నుంచి బయటపడేందుకు అగ్రరాజ్యం మార్గాలు వెతుకుతోందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి..

ఈ క్రమంలో మొదటి నుండి పట్టుబట్టిన న్యూక్లియర్‌ డీల్‌ ను సైతం పక్కనబెట్టేందుకు ట్రంప్‌ సిద్ధమైనట్లు తెలుస్తోంది. అణు అంశాలు లేకుండానే టెహ్రాన్‌తో ఒప్పందం చేసుకోవాలని ఆయన భావిస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు అమెరికా మీడియా ప్రచురించిన కథనం ప్రకారం.. ఎలాంటి షరతులు లేకుండా హర్మూజ్‌ జలసంధిని ఇరాన్‌ పూర్తిగా అందుబాటులోకి తెస్తే ఆ దేశంతో ఒప్పందం కుదుర్చుకుందామని ట్రంప్‌ తన సన్నిహిత వర్గాలకు ప్రైవేటుగా చెప్పినట్లు సమాచారం.

అణు డీల్‌ లేకుండానే ఈ యుద్ధాన్ని ముగించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని ట్రంప్‌ పేర్కొన్నారట. శాంతి ఒప్పందం విషయంలో ఇటీవల అమెరికా-ఇరాన్‌ మధ్య జరిగిన చర్చలు ఫలించలేదు. మరోవైపు, పశ్చిమాసియాలో ఘర్షణలు ఎంతకాలమైనా కొనసాగించేందుకు టెహ్రాన్‌ సిద్ధంగా ఉన్నట్లు సంకేతాలు వెలువడ్డాయి. ఈ పరిణామాల నేపథ్యంలోనే ట్రంప్‌ అణు డీల్‌పై వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది.

మరోవైపు హర్మూజ్‌ జలసంధిని తెరిచే విషయంలో ఇరాన్‌ తన డిమాండ్లను స్పష్టంగా చెబుతోంది. అమెరికా దిగ్బంధనాన్ని వెంటనే ఎత్తివేయడంతో పాటు ఈ ప్రాంతం నుంచి అగ్రరాజ్య దళాలు వెళ్లిపోవాలని టెహ్రాన్ డిమాండ్‌ చేసింది. యుద్ధాన్ని శాశ్వతంగా ముగించేవరకూ హర్మూజ్‌ను తెరవబోమని కరాఖండీగా చెప్పింది. ఈ నేపథ్యంలో చర్చలకు ఈ అంశాలు అడ్డంకిగా మారినట్టు తెలుస్తుంది.

మరోవైపు ఈ ఉద్రిక్తతలపై ట్రంప్‌ చేస్తున్న బహిరంగం ప్రకటనలు భిన్నంగా ఉంటున్నాయి. తాజాగా ఓ మీడియాతో మాట్లాడుతూ.. ఇరాన్‌తో చర్చల విషయంలో తొందరేం లేదు. మేం ప్రశాంతంగా ఉన్నాం. టెహ్రాన్‌లో ద్రవ్యోల్బణం తీవ్రంగా ఉంది. వారి వద్ద సరిపడా నగదు లేదని వ్యాఖ్యానించడం గమనార్హం.

ఈ ప్రకటనలు ఇలాగే కొనసాగుతున్న క్రమంలో ఇరాన్‌ మళ్లీ తీవ్ర హెచ్చరికలు చేసింది. ఒకవేళ అమెరికా సిబ్బంది తమ దేశంలో అడుగుపెడితే తీవ్ర పరిణామాలు ఉంటాయని ఆ దేశ బ్రిగేడియర్‌ జనరల్‌ అలీ జహన్‌షాహీ హెచ్చరించడం చర్చాంశనీయంగా మారింది...

#International#America#Donald Trump#US-Iran War#Strait of Hormuz
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి