Spirituality

Spirituality: పూర్వజన్మ సంస్కారాలు మనుషుల్ని వెంటాడుతాయా?

రచన: Venu4 నిమిషాల పఠనం

హిందూ ఆధ్యాత్మిక తత్వం ప్రకారం, జీవితం ఒక్క జన్మతో ముగిసిపోదు. మనిషి చేసే కర్మలు, ఆలోచనలు, కోరికలు అన్నీ మనస్సుపై సంస్కారాలుగా ముద్రపడతాయని భావిస్తారు. ముఖ్యంగా బలమైన కోరికలు, అసంపూర్ణమైన సంకల్పాలు మనస్సులో లోతైన ముద్రలు వేస్తాయని ఉపనిషత్తులు, యోగ తత్వం, వేదాంత సంప్రదాయాలు వివరిస్తున్నాయి..

సమాజంలో కొందరికి మనసులో ఒక కోరిక పుట్టింది అంటే.. అది నెరవేర్చుకునే వరకు నిదుర పోరు.. అందుకే పెద్దలు అంటారు. ఇలాంటి వారు మరణించాక కూడా సాధిస్తారని.. అయితే ఒక మనిషి కోరికలతో చనిపోతే.. అది నెరవేర్చుకోవడానికి మళ్ళీ పుడతాడా అనే సందేహం మనలో చాలా మందికి కలుగుతుంది. అయితే మనిషిలో కలిగే కోరికలు పూర్వజన్మకు సంబంధించినవేనా? శాస్త్రాలు ఏం చెబుతున్నాయి? తెలుసుకుందాం..

హిందూ ఆధ్యాత్మిక తత్వం ప్రకారం, జీవితం ఒక్క జన్మతో ముగిసిపోదు. మనిషి చేసే కర్మలు, ఆలోచనలు, కోరికలు అన్నీ మనస్సుపై సంస్కారాలుగా ముద్రపడతాయని భావిస్తారు. ముఖ్యంగా బలమైన కోరికలు, అసంపూర్ణమైన సంకల్పాలు మనస్సులో లోతైన ముద్రలు వేస్తాయని ఉపనిషత్తులు, యోగ తత్వం, వేదాంత సంప్రదాయాలు వివరిస్తున్నాయి...

అయితే పూర్వజన్మలో కోరుకున్న ప్రతి కోరిక తప్పకుండా ఈ జన్మలో నెరవేరుతుందని శాస్త్రాలు చెప్పవు. దానికి బదులుగా.. గత కర్మల ప్రభావం, ప్రస్తుత జన్మలోని కర్మలు, మన సంకల్పం ఈ మూడూ కలిసి జీవిత అనుభవాలను ప్రభావితం చేస్తాయని ఆధ్యాత్మిక శాస్త్రం చెబుతుంది. కొన్ని సందర్భాల్లో ఒక వ్యక్తికి కారణం తెలియకుండానే కొన్ని విషయాలపై తీవ్రమైన ఆకర్షణ, భయం లేదా తపన ఉండవచ్చు.

వీటిని కొందరు పూర్వజన్మ సంస్కారాలతో పోల్చుతారు. అయితే గత జన్మలో ఏం జరిగిందో తెలుసుకోవడం కంటే, ఈ జన్మలో మనం ఏం చేస్తున్నామన్నదే ముఖ్యమనే విషయం పై అవగాహన ఉండటం మంచిదని పండితులు చెబుతున్నారు. ఎందుకంటే కర్మ సిద్ధాంతం ప్రకారం.. గతం మన పరిస్థితులను ప్రభావితం చేయవచ్చు. కానీ వర్తమానంలో చేసే కర్మలు మన భవిష్యత్తుకు దిశను చూపిస్తాయి.

అందుకే ప్రతి అసంపూర్ణ కోరికను పూర్వజన్మ రుణంగా భావించడం కంటే.. దాని వెనుక ఉన్న మనసు, కర్మ, సంకల్పాన్ని అర్థం చేసుకోవడం ఆధ్యాత్మికంగా మరింత లోతైన దారి అని అంటున్నారు.. బహుశా పూర్వజన్మ కోరిక నెరవేరడమే మన జీవిత లక్ష్యం కాకపోవచ్చు. ఆ కోరికను దాటి మనల్ని మనం తెలుసుకోవడమే అసలైన ప్రయాణం కావచ్చు అనే ఆలోచనతో ముందుకు సాగాలని గురువులు చెబుతున్నారు..

గమనిక: ఇక్కడ అందించిన వివరాలు కేవలం సాంప్రదాయ పురాణ విశ్వాసాలు మరియు ఆధ్యాత్మిక భావనల ఆధారంగా ఇవ్వబడ్డాయి. వీటిని కేవలం మతపరమైన విశ్వాసాల కోణంలోనే చూడాలి. వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునే ముందు సంబంధిత రంగ నిపుణులను సంప్రదించడం మంచిది.

#Spirituality#Indian Culture#memories#past lives#people
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి