స్వేచ్ఛ ఛైర్మన్ డెస్క్

Minister PRO: ఆ మంత్రి పీఆర్వో రూటే సపరేట్ ?

రచన: Swechaanews Chairman5 నిమిషాల పఠనం

ఆయన ఉత్తర తెలంగాణలో జూనియర్ మంత్రిగా చూస్తారు. గతంలో ఆయన వద్దకు ఓ సీనియర్ మంత్రి చెప్పితే ఓ కీలక పోస్టుకు ఓకే చెప్పారు. జూనియర్ మంత్రి పేషీలో సీనియర్ మంత్రి నిఘా అంటూ స్వేచ్ఛ న్యూస్ కథనాలు వ్రాయడంతో పోస్టింగ్ ఆగిపోయింది. సోషల్ వెల్ఫేర్ డిపార్మెంట్ నుంచి వచ్చిన ఆ పీఆర్వో తీరు మంత్రి వద్ద అందరినీ కలవర పెట్టిస్తుంది.

  • చేష్టలన్నీ మరోలా ?

  • నైపుణ్యం పెంచుకోవాలని ప్రభుత్వం ట్రైనింగిస్తుంటే ?

  • మేడమ్ గారి పేరు చెప్పి పైరవీ పనులకే పరిమితం ?

  • తోటి ఉద్యోగులతో దురుసుగా ప్రవర్తన

  • మహిళ ఉద్యోగులకు వేధింపులు

  • ఈ ఔట్ సోర్స్ ఎంప్లాయీకీ సపరేట్ క్యాబిన్ ఇవ్వడంతో మరింత విచ్చల విడితనం

  • ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొస్తున్న పీఆర్వో తీరుపై స్వేచ్ఛ ఇన్వెస్టిగేషన్ కథనం.

దేవేందర్ రెడ్డి చింతకుంట్ల,

స్వేచ్ఛ చైర్మన్,

9848070809

మంత్రిగారికి తెలియకుండానే పైరవీలు

ఆయన ఉత్తర తెలంగాణలో జూనియర్ మంత్రిగా చూస్తారు. గతంలో ఆయన వద్దకు ఓ సీనియర్ మంత్రి చెప్పితే ఓ కీలక పోస్టుకు ఓకే చెప్పారు. జూనియర్ మంత్రి పేషీలో సీనియర్ మంత్రి నిఘా అంటూ స్వేచ్ఛ న్యూస్ కథనాలు వ్రాయడంతో పోస్టింగ్ ఆగిపోయింది. సోషల్ వెల్ఫేర్ డిపార్మెంట్ నుంచి వచ్చిన ఆ పీఆర్వో తీరు మంత్రి వద్ద అందరినీ కలవర పెట్టిస్తుంది. ఈయన ఎక్కడ జర్నలిస్టుగా పని చేయలేదు. ఒక్క ప్రెస్ నోట్ కూడా సరిగ్గా రాయడం రాదు. ఔట్ సోర్స్ ఎంప్లాయీగా జాయిన్ అయ్యారు. ఓ ఐఎఎస్ అధికారి ఢిల్లీకి వెళ్తుండగా ఈ మంత్రి వద్దకు పంపించారు. దీంతో ఈయన ఇక్కడ పీఆర్వో ఉద్యోగం కాకుండా అన్ని పనులు చక్కబెడుతున్నారని తెలుస్తోంది. మంత్రి గారి భార్య పేరు చెప్పి.. ‘మేడమ్ చాలా క్లోజ్..’ అంటూ అన్ని ఫైల్స్ తీసుకుంటున్నారు. ఇయనకు ప్రత్యేక క్యాబిన్ కూడా ఇచ్చారు. దీంతో తోటి ఉద్యోగుల ప్రవర్తన కూడా మారిపోయింది. డిపార్మెంట్ లో లేడీ ఉద్యోగులను వ్యంగంగా చూడటం, వెరైటీ మాటతో ఇబ్బందులకు గురిచేయడంతో మనస్తాపం చెందుతున్నారు. ఎవ్వరికి చెప్పుకోవాలో తెలియక లోలోపల బాధపడుతున్నారు. సీనియర్ ఉద్యోగులు వచ్చినా వాళ్లను నువ్వెంత అనే చందంగా మాట్లాడటం, రిటైర్డ్ ఉద్యోగులు మంత్రిని కలవడానికి వస్తే వారికి కనీస మర్యాద కూడా ఇవ్వకపోవడం ఆ శాఖకు చెడ్డపేరు తీసుకొస్తున్నారు.

మేడమ్ పేరు చెప్పి హల్‌చల్

మాటకు ముందు మేడమ్, మాటకు వెనక మేడమ్ నేను మేడమ్ తో చెప్పి చేయిస్తాను. మంత్రిగారిని కలవాల్సిన అవసరం లేదు. అంతా మేడమే అంటూ అన్ని ఫైల్స్ అతనే మేయింటెన్ చేయడంపై కొద్ది రోజుల క్రితం మంత్రి హెచ్చరించినట్లు సమాచారం. క్యాబిన్ లోకి వెళ్లి బిల్డప్ లు ఇవ్వొద్దని అదేశాలు జారీ చేసినట్లు సమాచారం . కాని మంత్రి లేని సమయంలో మళ్లీ ఆయన రోల్ ఇంకా విచ్చల విడిగా వ్యవహారించడం డిపార్మెంట్‌ లో సీనియర్ అధికారులు ఇదేం పద్దతి అంటూ ముక్కు విరుస్తున్నారు. పీఆర్వో కి అన్ని పవర్స్ ఉన్నట్లు వ్యవహరించడంతో తోటి ఉద్యోగులు నొచ్చుకుంటున్నారు. మహిళ ఉద్యోగుల పై వెకిలి చేష్టలు తుమ్మరం పుట్టిస్తున్నాయని పేషి ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇతన్ని ఇంకా కొనసాగిస్తే ఇక సదరు మంత్రి గారి కుటుంబం పేరు చెప్పి పేషి అబాసు పాలు కావడం ఖాయం. ఈ శాఖ లో ఈ పీఆర్వో పై నిఘా ఉంచి దర్యాప్తు చేసి కంట్రోల్ చేయాల్సిందిగా వేడుకుంటున్నారు.

#Minister PRO#Telangana Politics#Government Employees#PRO Controversy#Swechcha Investigation#Telangana News#Swechaanews
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి