తెలంగాణ

BRS : పెద్ది ‘గద్దె’ను కూల్చడం దుర్మార్గం..ముమ్మాటికీ కాంగ్రెస్ కుట్రే : ఎర్రబెల్లి

రచన: Kumar••4 నిమిషాల పఠనం

దివంగత నేత, బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహ ఏర్పాటు కోసం నిర్మించిన ‘గద్దె’ను రాత్రికి రాత్రే కూల్చేశారు. నర్సంపేట ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఎదురుగా పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహా ఏర్పాటుకు బీఆర్ఎస్ నేతలు సంకల్పించగా.. అనుమతి లేదంటూ మున్సిపాలిటీ అధికారులు కూల్చివేశారు.

దివంగత నేత, బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహ ఏర్పాటు కోసం నిర్మించిన ‘గద్దె’ను రాత్రికి రాత్రే కూల్చేశారు. నర్సంపేట ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఎదురుగా పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహా ఏర్పాటుకు బీఆర్ఎస్ నేతలు సంకల్పించగా.. అనుమతి లేదంటూ మున్సిపాలిటీ అధికారులు కూల్చివేశారు. ప్రైవేట్ స్థలంలో విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నా అనుమతి లేదంటూ రాత్రి వేళ అక్రమంగా అధికారులు కూల్చేయడంపై మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మండిపడ్డారు.

నర్సంపేటలో పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహ ఆవిష్కరణకు ఏర్పాటు చేసిన గద్దె కూల్చివేసిన ప్రదేశాన్ని మాజీ మంత్రివర్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు సందర్శించారు. దీంతో నర్సంపేటలో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా ఎర్రబెల్లి మాట్లాడుతూ.. ‘పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహ ఆవిష్కరణ గద్దె కూల్చివేయడం దుర్మార్గం. విగ్రహ ఆవిష్కరణను అడ్డుకోవడం దుర్మార్గపు చర్య.

ఈ కుట్ర వెనక కాంగ్రెస్ నాయకులు ఉన్నారు. ఎన్ని ఆటంకాలు సృష్టించినా కచ్చితంగా పెద్ది సుదర్శన్ రెడ్డి గారి విగ్రహం ఆవిష్కరించి తీరుతాం.ఈ కుట్రలు చూస్తుంటే పెద్ది సుదర్శన్ రెడ్డి మరణంపై కూడా మాకు అనుమానాలు వస్తున్నాయి తనను మానసికంగా ఎంత ఇబ్బంది పెట్టారో అర్ధం అవుతోంది. విగ్రహం గద్దెను ఎలాంటి సమాచారం లేకుండా కూల్చివేయడం దారుణం.

https://x.com/TeluguScribe/status/2086679490277830995?s=20

నర్సంపేట పట్టణంలో ఎన్ని విగ్రహాలు అనుమతితో పెట్టారు? పెద్ది దశదిన కార్యక్రమం ఉన్నందున తాత్కాలిక ఈ ధర్నాను విరామించుకున్నాం. రెండు రోజుల సమయం ఇస్తున్నాం. ఆలోపు ఈ విగ్రహ గద్దెను కూల్చిన వారిని శిక్షించకపోతే రాష్ట్రవ్యాప్తంగా,ఉమ్మడి వరంగల్ జిల్లా గ్రామగ్రామన పెద్దఎత్తున నిరసన కార్యక్రమం చేపడతాం’ అని హెచ్చరించారు.

https://x.com/TeluguScribe/status/2086650542659403890?s=20

#peddi sudarshan reddy#statue foundation#demolish#errabelli dayakar#politics
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి