తెలంగాణ

Telangana: తెలంగాణలో మరో స్కామ్.. వెలుగులోకి నకిలీ సదరం సర్టిఫికెట్ల భాగోతం!..

రచన: Venu•••5 నిమిషాల పఠనం

కామారెడ్డి జిల్లాలో నకిలీ సదరం సర్టిఫికెట్లతో ఉద్యోగాలు పొందిన ఘటన చర్చనీయాంశంగా మారింది. నకిలీ సర్టిఫికెట్లతో దివ్యాంగుల కోటా కింద 18 మంది ఎంపికైనట్లు అధికారులు గుర్తించారు.. వీరు టీఎస్పీఎస్సీ ద్వారా జరిగిన ఎంపిక పరీక్షలో ఉద్యోగాలు పొందినట్లు తెలిపారు.. కాగా మెడికల్ బోర్డు వైద్య పరీక్షల్లో ఈ భాగోతం వెలుగులోకి వచ్చింది.

సమాజంలో ప్రస్తుతం చోటు చేసుకుంటున్న సంఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఒకవైపు కష్టపడి చదువుకున్న వారికి ఉద్యోగాలు లేక రోజు రోజుకు నిరుద్యోగం పెరిగిపోతుందని సర్వేలు చెబుతున్నాయి.. మరికొందరైతే దొంగ సర్టిఫికెట్లుతో.. డబ్బు పలుకుబడి ఉంటే రికమండేషన్లతో అర్హత లేకున్నా.. ఉద్యోగాలు పొందుతున్నారనే ఆరోపణలు.. ఇవి చాలదన్నట్టు దివ్యాంగుల కోటా ను కూడా ఉపయోగించుకుంటూ ఉద్యోగాలు పొందడం కలకలం రేపుతుంది.

ఇలాంటి ఘటనలు ఈ మధ్య కాలంలో వెలుగులోకి రావడం కనిపిస్తుంది. అయితే తాజాగా కామారెడ్డి జిల్లాలో నకిలీ సదరం సర్టిఫికెట్లతో ఉద్యోగాలు పొందిన ఘటన చర్చనీయాంశంగా మారింది. నకిలీ సర్టిఫికెట్లతో దివ్యాంగుల కోటా కింద 18 మంది ఎంపికైనట్లు అధికారులు గుర్తించారు.. వీరు టీఎస్పీఎస్సీ ద్వారా జరిగిన ఎంపిక పరీక్షలో ఉద్యోగాలు పొందినట్లు తెలిపారు.. కాగా మెడికల్ బోర్డు వైద్య పరీక్షల్లో ఈ భాగోతం వెలుగులోకి వచ్చింది.

మరోవైపు ఇలా ఎంపికైన వారిలో శారీరక లోపాలు, అంగవైకల్యం వంటివి లేవని.. వీళ్ళు తప్పుడు మార్గాల్లో సదరం సర్టిఫికెట్స్ పొంది ఉద్యోగాలకు ఎంపికైనట్లు తేలింది. ఇక కొందరు అధికారులు తక్కువ అంగవైకల్యం ఉన్న వాళ్ళకు ఎక్కువ ప్రాబ్లం ఉన్నట్లు పేర్కొంటూ సదరం సర్టిఫికెట్లు జారీ చేసినట్టు అధికారులు గుర్తించారు. మరోవైపు ఈ ఘటనపై సీరియస్ అయిన జిల్లా కలెక్టర్.. నకిలీ ఉద్యోగుల జాబితాను డీఆర్డీఏకు పంపించి విచారణకు ఆదేశించారు.

ఇక దివ్యాంగుల కోటాలో రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగాలు పొందిన మరికొందరి సర్టిఫికెట్లపైనా పరిశీలన జరిగితే.. నకిలీ ఉద్యోగుల సంఖ్య పెరిగే అవకాశాలున్నాయనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.. మరోవైపు సదరం సర్టిఫికెట్లపై జరుగుతున్న విచారణలో.. అవి నిబంధనలకు విరుద్ధంగా జారీ అయినట్లు నిర్ధారణ అయితే, సంబంధిత సర్టిఫికెట్లను రద్దు చేసేందుకు అధికారులు చర్యలు తీసుకునే అవకాశం ఉంది.

అలాగే ఆ సర్టిఫికెట్ల ఆధారంగా ఉద్యోగాలు పొందినట్లు తేలితే.. అలాంటి వారిపై నిబంధనల ప్రకారం చర్యలు తీసుకునే అవకాశముంది. ఇప్పటివరకు పొందిన జీతాలు, ప్రభుత్వ పథకాల ద్వారా అందిన ప్రయోజనాల రికవరీపై కూడా విచారణ అనంతరం నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు అధికారులు వెల్లడిస్తున్నారు.

మొత్తానికి ఈ వ్యవహారం వెనుక ఎవరెవరి హస్తం ఉంది? నిబంధనలకు విరుద్ధంగా సర్టిఫికెట్ల జారీకి ఎవరు సహకరించారు? అనే విషయాలపై దర్యాప్తులో స్పష్టత రావాల్సి ఉంది. ఈ స్కామ్‌కు సంబంధించిన పూర్తి నిజాలు వెలుగులోకి వచ్చే వరకు రాష్ట్రవ్యాప్తంగా ఉత్కంఠ కొనసాగనుంది.

#Telangana#kamareddy#fake#sadarem certificates#scam#racket
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి