రాజకీయాలు

BRS : రూ.100 కోట్లకుపైగా భూమిని రూ.7 కోట్లకే కట్టబెట్టిన రేవంత్ : క్రిశాంక్

రచన: Kumar••3 నిమిషాల పఠనం

సీఎం రేవంత్ రెడ్డి మీద బీఆర్ఎస్ కీలక నేత మన్నె క్రిశాంక్ మరోసారి సంచలన ఆరోపణలు చేశారు. సీఎం తన తమ్ముడు కొండల్ రెడ్డికి చెందిన కంపెనీకి రావిర్యాలలోని ఫోర్త్ సిటీలో రూ.100 కోట్లకు పైగా విలువైన 5 ఎకరాల భూమిని కేవలం రూ.7 కోట్లకు కట్టబెట్టారని ఆరోపించారు.

సీఎం రేవంత్ రెడ్డి మీద బీఆర్ఎస్ కీలక నేత మన్నె క్రిశాంక్ మరోసారి సంచలన ఆరోపణలు చేశారు. సీఎం తన తమ్ముడు కొండల్ రెడ్డికి చెందిన కంపెనీకి రావిర్యాలలోని ఫోర్త్ సిటీలో రూ.100 కోట్లకు పైగా విలువైన 5 ఎకరాల భూమిని కేవలం రూ.7 కోట్లకు కట్టబెట్టారని ఆరోపించారు. కొండల్ రెడ్డి సూట్ వెయ్యగానే ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ ఎక్స్‌పర్ట్ అయిపోయారా? అంటూ ప్రశ్నించారు. సోమవారం బీఆర్ఎస్ భవన్‌లో మీడియాతో మాట్లాడిన క్రిశాంక్.. పలు అంశాలను ఈ సందర్బంగా ప్రస్తావించారు.

రేవంత్ సోదరుడు అనుముల కొండల్ రెడ్డికి చెందిన ‘టెస్సెరాక్ట్ అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్’ కంపెనీ బాగోతాన్ని మన్నె క్రిశాంక్ బయటపెట్టారు. ఈ డొల్ల షెల్ కంపెనీని అడ్డం పెట్టుకొని సీఎం సోదరుడు కొండల్ రెడ్డి అమెరికా వాళ్లను కూడా మోసం చేస్తున్నారని, వాళ్లతో సమావేశం పెడుతున్నారని ఆరోపించారు.

కేవలం రూ.లక్షతో మొదలైన కంపెనీ.. ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ సిస్టమ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుందని విమర్శలు చేశారు.కానీ, అవి మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలంటే డీపీఐఐటీ లైసెన్స్ ఉండాలని, కొండల్ రెడ్డి కంపెనీకి లైసెన్స్ లేదన్నారు.ఈ కంపెనీ ఎలాంటి ఉత్పత్తులను తయారుచేయకపోయినా రూ.కోటి ఫారిన్ ఎక్స్చేంజ్ ఎర్నింగ్స్ వచ్చాయని చెప్పారు.

ఇంకో దారుణం ఏంటి అంటే కంపెనీలో అసలు ఒక్క ఉద్యోగి కూడా లేకుండా పటాన్‌చెరువులోని శ్రీకృష్ణ నగర్‌లో ఒక ఇంట్లో నడిపిస్తున్నారని అన్నారు. ఈ కంపెనీ షేర్ల విలువ కూడా కేవలం రూ.లక్ష మాత్రమే ఉందని మన్నె క్రిశాంక్ సంచలన ఆరోపణలు చేయడం గమనార్హం.

https://x.com/TeluguScribe/status/2086711626791555305?s=20

#brs#congress#manne krishank#cm revanth reddy#land scam
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి