తెలంగాణ

ఆర్టీసీ బస్సులో రూ.2 లక్షలు, ల్యాప్‌టాప్ బ్యాగ్ లభ్యం.. సిబ్బంది ఏం చేశారంటే!

రచన: Mamatha puppala4 నిమిషాల పఠనం

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) మేడ్చల్ డిపోకు చెందిన ఆర్టీసీ సిబ్బంది తమ సమయస్ఫూర్తిని, నిజాయితీని చాటుకుని ప్రయాణికుల ప్రశంసలు అందుకున్నారు. బస్సులో ఓ ప్రయాణికుడు పొరపాటున మరిచిపోయిన సుమారు రూ.2 లక్షల నగదు, ఖరీదైన యాపిల్ ల్యాప్‌టాప్‌తో కూడిన బ్యాగ్‌ను బాధితుడికి భద్రంగా అప్పగించి మానవత్వాన్ని చాటారు.

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) మేడ్చల్ డిపోకు చెందిన ఆర్టీసీ సిబ్బంది తమ సమయస్ఫూర్తిని, నిజాయితీని చాటుకుని ప్రయాణికుల ప్రశంసలు అందుకున్నారు. బస్సులో ఓ ప్రయాణికుడు పొరపాటున మరిచిపోయిన సుమారు రూ.2 లక్షల నగదు, ఖరీదైన యాపిల్ ల్యాప్‌టాప్‌తో కూడిన బ్యాగ్‌ను బాధితుడికి భద్రంగా అప్పగించి మానవత్వాన్ని చాటారు.

ఆగస్టు 8 రాత్రి మేడ్చల్ డిపోకు చెందిన 215/2 సర్వీస్ నంబర్ బస్సు పటాన్‌చెరువు నుంచి సికింద్రాబాద్ మార్గంలో వెళ్తుండగా, కేపీహెచ్‌బీలో ఎక్కిన ప్రశాంత్ అనే ప్రయాణికుడు రాత్రి 1:15 గంటల సమయంలో ప్యాట్నీ వద్ద దిగాడు. అయితే తొందరలో తన విలువైన బ్యాగ్‌ను సీట్లోనే వదిలేశాడు. బస్సు తిరుగు ప్రయాణంలో ఉండగా కండక్టర్ గోవింద్ సదరు బ్యాగ్‌ను గమనించి, డ్రైవర్ ఇస్మాయిల్ సాయంతో డిపో అసిస్టెంట్ మేనేజర్ రామారావు, విజిలెన్స్ అధికారులకు సమాచారం అందించారు.

అధికారుల సమక్షంలో బ్యాగ్ తెరిచి చూడగా అందులో రూ. 2 లక్షల రోకడు నగదుతో పాటు యాపిల్ ల్యాప్‌టాప్, చార్జర్, పర్సులు, ఆఫీస్ ఐడీ కార్డు ఉన్నాయి. ఐడీ కార్డులోని ఫోన్ నంబర్ ఆధారంగా అధికారులు బాధితుడు ప్రశాంత్‌ను సంప్రదించి డిపోకు పిలిపించారు. సామగ్రినంతా సరి చూసుకున్న అనంతరం బ్యాగ్‌ను అతనికి క్షేమంగా అందించారు. పోయిందనుకున్న తన విలువైన ల్యాప్‌టాప్, నగదు సురక్షితంగా తిరిగి దక్కడంతో ప్రయాణికుడు ప్రశాంత్ తీవ్ర ఆనందం వ్యక్తం చేశాడు. కండక్టర్ గోవింద్, డ్రైవర్ ఇస్మాయిల్ సమయస్ఫూర్తికి, నిజాయితీకి డిపో అధికారులతో పాటు బాధితుడు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

ఆర్టీసీ సిబ్బంది నిజాయితీపై సంస్థ యాజమాన్యంతో పాటు ప్రయాణికుల నుంచి పెద్దఎత్తున ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. అత్యంత విలువైన నగదు, ఆపిల్ ల్యాప్‌టాప్ ఉన్నప్పటికీ ఆశకు పోకుండా బాధితుడికి చేర్చడంలో చూపిన చొరవను మేడ్చల్ డిపో అధికారులు ప్రత్యేకంగా కొనియాడారు. కండక్టర్ గోవింద్, డ్రైవర్ ఇస్మాయిల్‌ల సేవలను గుర్తించి వారికి త్వరలోనే సంస్థ తరఫున ప్రశంసా పత్రాలతో పాటు ప్రత్యేక పురస్కారాన్ని అందించనున్నట్లు అధికారులు తెలిపారు. ఆర్టీసీ సిబ్బందిపై ప్రజల్లో నమ్మకాన్ని పెంచేలా వ్యవహరించిన వీరి ఉదారత ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో కూడా వైరల్‌గా మారింది.

#MedchalRTC#TGSRTC#HonestRTCStaff#SecunderabadNews#TelanganaNews#HyderabadNews#swechaanews
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి