International

Australia: ఊహించని పని చేసిన ఏఐ.. నియమాలను ఉల్లంఘించి!..

రచన: Venu5 నిమిషాల పఠనం

ఏఐలో ఉన్న లోపాలు ఒక్కొక్కటిగా బయటికి వస్తుంటే విస్తుపోవడం మానవ వంతుగా మారింది. ప్రపంచాన్ని ఆనందంతో పాటు ఆందోళనలో ముంచెత్తుతున్న ఈ టెక్నాలజీ చేసిన మరో ఘన కార్యం ఆస్ట్రేలియాలో వెలుగులోకి వచ్చింది.

హ్యాకింగ్ అనేది వ్యవస్థలు బలహీనంగా ఉన్నప్పుడు జరిగే క్రైమ్ గా నిపుణులు పేర్కొంటారు. అయితే ప్రస్తుతం టెక్నాలజీ రాకెట్ వేగంతో అభివృద్ధి చెందుతూ.. మనుషులను తమ ఆధీనంలోకి తీసుకుంటున్నాయనే ఆరోపణలు ఉన్న నేపథ్యంలో ఏఐ అనే టెక్నాలజీ ప్రపంచాన్ని శాసించే స్థాయికి చేరుకుంది. అయితే ఈ టెక్నాలజీ పై ఇప్పటికే విపరీతమైన ఆందోళన వ్యక్తం అవుతున్న విషయం తెలిసిందే.

మరోవైపు ఏఐలో ఉన్న లోపాలు ఒక్కొక్కటిగా బయటికి వస్తుంటే విస్తుపోవడం మానవ వంతుగా మారింది. ప్రపంచాన్ని ఆనందంతో పాటు ఆందోళనలో ముంచెత్తుతున్న ఈ టెక్నాలజీ చేసిన మరో ఘన కార్యం ఆస్ట్రేలియాలో వెలుగులోకి వచ్చింది.

ఇక్కడ ఉపయోగిస్తున్న ఒక ఏఐ పర్సనల్ అసిస్టెంట్ జిమ్ బుకింగ్ సిస్టమ్‌లోని భద్రతా లోపాన్ని గుర్తించి, సాధారణ యూజర్‌కు అనుమతించకుండా బుకింగ్ చేయడమే కాకుండా మరో వ్యక్తి వెయిటింగ్ లిస్ట్ స్థానాన్ని కూడా మార్చింది.

ఏఐ స్వయంగా సిస్టమ్‌లోని లోపాన్ని ఉపయోగించుకోవడాన్ని తొలి ఆస్ట్రేలియన్ ఆటోనమస్ సైబర్ అటాక్‌గా నిపుణులు పేర్కొంటున్నారు. మెల్‌బోర్న్‌కు చెందిన ఆండ్రూ అనే వ్యక్తి ఉదయం క్లాస్‌కు జిమ్‌లో సీటు బుక్ చేసుకునేందుకు తన పర్సనల్ ఏఐ అసిస్టెంట్‌ను ఉపయోగించాడు. అయితే క్లాస్ బుకింగ్ వ్యవస్థను పరిశీలించిన ఏఐ.. సాధారణ వెబ్‌పేజీ పరిమితులను దాటి, దాని వెనుక పనిచేస్తున్న APIలో భద్రతా లోపాన్ని గుర్తించి.. జిమ్ నిర్దేశించిన బుకింగ్ సమయానికి ముందుగానే క్లాస్‌ను బుక్ చేసింది.

అయితే ఆండ్రూ వెయిటింగ్ లిస్ట్‌లో నాలుగో స్థానంలో ఉన్న తన స్థానాన్ని ముందుకు తీసుకురాగలమా అని ఏఐని అడిగడం సమస్యగా మారింది. అడిగిన ప్రశ్నకు ఏఐ సమాధానం చెప్పకుండా.. వెయిటింగ్ లిస్ట్‌లో తనకంటే ముందున్న వ్యక్తి రిజర్వేషన్‌ను క్యాన్సిల్ చేసింది. దీంతో ఆండ్రూ నాలుగో స్థానం నుంచి మూడో స్థానానికి చేరుకున్నాడు.

ఏఐ పై ఆందోళన కలిగించే విషయం ఏమిటంటే.. ఆండ్రూ ఆ వ్యక్తిని తొలగించాలని స్పష్టంగా ఆదేశించలేదు. కానీ ఏఐ తన లక్ష్యాన్ని సాధించేందుకు తనంతట తానుగా ఆ మార్గాన్ని ఎంచుకుంది. ఇది గమనించిన ఆండ్రూ ఆ వ్యక్తిని తిరిగి వెయిటింగ్ లిస్ట్‌లో చేర్చాలని కోరగా.. అది తాను సరిచేయలేనని ఏఐ సమాధానమిచ్చింది. ఈ ఘటనతో ఏఐ ఉపయోగం పై మరోసారి చర్చ మొదలైంది.

వెబ్, APIలు, చెల్లింపులు, ఇమెయిల్స్ వంటి వ్యవస్థలపై యాక్షన్స్ తీసుకునే సామర్థ్యం ఏఐకి ఇస్తే, అది అనుకోకుండా నియమాలను ఉల్లంఘించినప్పుడు బాధ్యత ఎవరిది? అనే ప్రశ్నను లేవనెత్తింది.. ఇప్పటికే OpenAI, Anthropic వంటి సంస్థలు సైతం ఏఐ ఏజెంట్ల ప్రమాదకర చర్యలను వెలుగులోకి తెస్తున్న నేపథ్యంలో.. ఏఐ సామర్థ్యం పై అనుమానాలు ప్రపంచ వ్యాప్తంగా మొదలవుతున్నాయి..

#Australia#AI assistant#gym booking#hacking#commands
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి