ప్రపంచం

US Iran War: హర్మూజ్‌లో హైటెన్షన్.. 20కిపైగా యుద్ధ నౌకలు మోహరింపు.. అమెరికా ఏం చేయబోతోంది?

రచన: NK••4 నిమిషాల పఠనం

ప్రపంచ చమురు రవాణకు అత్యంత కీలకమైన హర్మూజ్ జలసంధిలో హైటెన్షన్ నెలకొంది. అక్కడ అమెరికా 20కి పైగా యుద్ధ నౌకలను మోహరించింది. దీంతో ఎప్పుడు ఏం జరుగుతుందో అనే టెన్షన్ నెలకొంది. తమ డిమాండ్లను నెరవేరిస్తేనే హర్మూజ్ జలసంధిని తెరుస్తామని ఇరాన్ పట్టుబడుతోంది. ఈ క్రమంలో అగ్రరాజ్యం అమెరికా కీలక నిర్ణయం తీసుకుంది.

US Iran War: ప్రపంచ చమురు రవాణకు అత్యంత కీలకమైన హర్మూజ్ జలసంధిలో హైటెన్షన్ నెలకొంది. అక్కడ అమెరికా 20కి పైగా యుద్ధ నౌకలను మోహరించింది. దీంతో ఎప్పుడు ఏం జరుగుతుందో అనే టెన్షన్ నెలకొంది. తమ డిమాండ్లను నెరవేరిస్తేనే హర్మూజ్ జలసంధిని తెరుస్తామని ఇరాన్ పట్టుబడుతోంది. ఈ క్రమంలో అగ్రరాజ్యం అమెరికా కీలక నిర్ణయం తీసుకుంది. హర్మూజ్ జలసంధిలో యుద్ధ నౌకలను మోహరించింది. నేవీ డెస్ట్రాయర్ సహా 20కి పైగా వార్ షిప్స్ ను మోహరించినట్లు అమెరికా సెంట్రల్ కమాండ్ వెల్లడించింది. అమెరికా చర్య ఇప్పుడు ఉత్కంఠగా మారింది. అమెరికా ఏం చేయబోతోంది? ఈ చర్య దాడి చేసేందుకా లేక భయపెట్టేందుకా అన్న చర్చ నడుస్తోంది.

ఇరాన్‌పై వాషింగ్టన్ విధించిన నావికా దిగ్బంధనాన్ని అమలుచేసే క్రమంలో, తమ బలగాలు 55 వాణిజ్య నౌకలను దారి మళ్లించాయని, రెండింటిని నిలిపివేశాయని, మరో రెండింటిని స్వాధీనం చేసుకున్నాయని యూఎస్ సెంట్రల్ కమాండ్ (సెంట్‌కామ్) తెలిపింది. ఈ ఆపరేషన్‌ను కొనసాగించడానికి 20కి పైగా యుద్ధనౌకలను మిడిల్ ఈస్ట్ అంతటా మోహరించినట్లు వెల్లడించింది.

"యూఎస్ఎస్ రాస్ (DDG 71) బ్రిడ్జిపై యూఎస్ నావికులు కాపలా కాస్తున్నారు. ఇరాన్‌పై యూఎస్ దిగ్బంధనాన్ని కఠినంగా అమలు చేయడం సహా సైనిక కార్యకలాపాలకు మద్దతుగా మిడిల్ ఈస్ట్ లో మోహరించిన 20కి పైగా అమెరికా యుద్ధ నౌకలలో రాస్ ఒకటి. దిగ్బంధనాన్ని పాటిస్తున్నారో లేదో నిర్ధారించుకోవడానికి సెంట్‌కామ్ 55 వాణిజ్య నౌకలను దారి మళ్లించింది, రెండింటిని నిలిపివేసింది, మరో రెండింటిని స్వాధీనం చేసుకుంది," అని సెంట్రల్ కమాండ్ తెలిపింది.

కాగా, హర్మూజ్ జలసంధిని తెరిచే అంశంపై ఇరాన్ అమెరికా ముందు పలు డిమాండ్లు ఉంచింది. అమెరికా జరిపిన దాడుల్లో కలిగిన నష్టానికి పరిహారం చెల్లించడంపైనే జలసంధిని తిరిగి తెరవడం పాక్షికంగా ఆధారపడి ఉంటుందని ఇరాన్ తేల్చి చెప్పింది. ఇరాన్‌పై అమెరికా బెదిరింపులు ఆపాలి, తమ మిత్రదేశాలపై (లెబనాన్, పాలస్తీనా, యెమెన్) దురాక్రమణను నిలిపివేయాలి, గల్ఫ్‌లో అమెరికా నావికా దిగ్బంధనాన్ని తొలగించాలి, తమపై ఆంక్షలను ఎత్తివేయాలి, స్తంభింపజేసిన తమ ఆస్తులను విడుదల చేయడం వంటి డిమాండ్లను అగ్రరాజ్యం అమెరికా ముందు ఉంచింది ఇరాన్.

#US Iran War#Hormuz#US Warships#Iran#Middle East#Swechaa News
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి