సినిమా

Raaka: అల్లు అర్జున్ నోటివెంట రాకా షూటింగ్ అప్‌డేట్

రచన: Anshu4 నిమిషాల పఠనం

Raaka: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియా సినిమా రాకా. తాజాగా, ఈ సినిమా షూటింగ్ అప్‌డేట్‌ను స్వయంగా అల్లు అర్జున్ వెల్లడించాడు. వైజాగ్ లో కొత్త మల్టీప్లెక్స్ ఓపెనింగ్ కార్యక్రమానికి వచ్చిన అల్లు అర్జున్ ఈ అప్‌డేట్‌ను అభిమానులతో పంచుకున్నాడు. దీనితో ఫ్యాన్స్‌తో పాటు సినీ లవర్స్ కూడా ఎంతో ఎగ్జైట్ అయ్యారు.

Raaka: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియా సినిమా రాకా. తాజాగా, ఈ సినిమా షూటింగ్ అప్‌డేట్‌ను స్వయంగా అల్లు అర్జున్ వెల్లడించాడు. వైజాగ్ లో కొత్త మల్టీప్లెక్స్ ఓపెనింగ్ కార్యక్రమానికి వచ్చిన అల్లు అర్జున్ ఈ అప్‌డేట్‌ను అభిమానులతో పంచుకున్నాడు. దీనితో ఫ్యాన్స్‌తో పాటు సినీ లవర్స్ కూడా ఎంతో ఎగ్జైట్ అయ్యారు.

వైజగ్ ప్రజల కోసం ఒక్క రోజు పర్మిషన్:

అల్లు అర్జున్ గత కొన్ని నెలలుగా నిర్విరామంగా రాకా షూటింగ్‌లో పాల్గొంటున్నాడు. ఇందులో ఆయన మేకప్ కోసమే కొన్ని గంటలు సమయం పడుతోంది. ఫ్యాక్షన్ బ్యాక్‌డ్రాప్‌లో హై టెక్నికల్ వ్యాల్యూస్‌తో దర్శకుడు అట్లీ కుమార్ ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నాడు. అధికారికంగా ప్రకటించకపోయినప్పటికీ, రెండు భాగాలుగా తెరకెక్కుతోంది. ఒక భాగంలో హీరోయిన్‌గా దీపిక పడుకొణ్ నటిస్తుండగా, రెండవ భాగంలో మృణాల్ ఠాకూర్ నటితున్నట్టుగా తెలుస్తోంది.

అయితే, ఇప్పటికే..హైదరాబాద్ అమీర్ పేట్‌లో, ట్రిపుల్ ఎ మల్టీప్లెక్స్ ని ప్రారంభించాడు. ఇది, బాగా రన్ అవుతోంది. ఇక, ఇటీవలే కోకాపేట్‌లో అల్లు సినిమాస్ ని ప్రారంభించాడు. కేవలం ఆంబియన్స్ చూసేందుకే, అల్లు సినిమాస్‌కి వీక్షకులు వెళుతున్నారు. అయితే, తాజాగా వైజాగ్‌లోనూ అల్లు మల్టీప్లెక్స్ ప్రారంభమైంది. ఈ కార్యక్రామానికి హాజరయ్యాడు బన్నీ.

ఈ సందర్భంగా, వైజాగ్ ఫ్యాన్స్-ప్రజలు అంటే ఎంత ఇష్టమో బన్నీ తెలిపాడు. వైజాగ్ ప్రజలంటే నాకు ప్రత్యేకమైన అభిమానం అని..అందుకే, డైరెక్టర్ అట్లీని ఒక్కరోజు పర్మిషన్ ఇవ్వమని రిక్వెస్ట్ చేసి నేరుగా ముంబై లో జరుగుతున్న రాకా షూటింగ్ సెట్స్ నుంచి వచ్చానని తెలిపాడు. ఇలా, వైజాగ్ ప్రజల కోసం అల్లు అర్జున్ రాకా షూట్ నుంచి నేరుగా రావడంతో ఎంతో ఆనందపడుతున్నారు. ప్రస్తుతం, అల్లు అర్జున్ చెప్పిన ఈ మాటలు నెట్టింట బాగా వైరల్ అవుతున్నాయి. కాగా, ఈ సినిమాను సన్ పిక్చర్స్ దాదాపు 700 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది. దీని, తర్వాత లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో మరో సినిమాను చేయనున్నాడు.

#alluarjun#raaka#atleekumar#deepikapadukone
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి