సినిమా

Korean Kanakaraju: బాక్సాఫీస్ వద్ద తగ్గని జోరు, 3 రోజుల్లోనే లాభాల్లోకి

రచన: Anshu4 నిమిషాల పఠనం

Korean Kanakaraju:మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన లేటెస్ట్ సినిమా కొరియన్ కనకరాజు. ఈ వారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన మూవీ ప్రేక్షకులను థియేటర్స్‌లో బాగా అలరిస్తోంది. మన ప్రేక్షకుల్లో కామెడీ, హర్రర్ జానర్ చిత్రాలకి బాగా అభిమానులున్నారు. ఆ ప్రేక్షకులందరికీ బాగా నచ్చుతుంది కొరియన్ కనకరాజు. డిఫరెంట్ కాన్సెప్ట్‌తో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద జోరు చూపిస్తోంది. జస్ట్ మూడు రోజుల్లోనే లాభాల బాట పట్టింది.

వరుణ్ తేజ్ కెరీర్‌లో ఇంత తక్కువ రోజుల్లో లాభాల బాట పట్టిన సినిమా బహుషా ఇదే కావచ్చు. మాస్ ఇమేజ్ ని పక్కన పెట్టి కథ, దర్శకుడిపై నమ్మకంతో చేసిన కొరియన్ కనకరాజు ఒక్క వరుణ్ తేజ్‌కి మాత్రమే కాదు, హీరోయిన్ రితిక నాయక్, కమెడియన్ సత్యకి మంచి సక్సెస్ ని ఇచ్చింది. మొదట్నుంచీ మేర్లపాక గాంధీకి మంచి టేస్ట్ ఉంది. ఒక్కో సినిమా కోసం బాగానే గ్యాప్ తీసుకుంటాడు.

కానీ, ప్రేక్షకులను మెప్పిస్తున్నాడు. మెగా అభిమానులే కాదు, కామన్ ఆడియన్స్ కూడా వరుణ్ తేజ్ నుంచి ఇలాంటి సినిమా వస్తుందని ఊహించరు. కాబట్టే..ఈ సినిమాకి ఇంతటి ఆదరణ లభిస్తోంది. వరుసగా బోనాల సందర్భంగా వచ్చిన సెలవులు కూడా వరుణ్ కొరియన్ కనకరాజుకి బాగా కలిసి వచ్చాయి. ఈ మధ్య కాలంలో హీరోయిన్‌కి స్క్రీన్ స్పేస్ ఉంటున్న సినిమాలు చాలా తక్కువ.

కానీ, కొరియన్ కనకరాజు సినిమాలో మాత్రం హీరోయిన్ రితిక నాయక్ కి మంచి స్క్రీన్ స్పేస్ దొరికింది. హీరో అంటే ఇటువంటి సినిమాలే చేయాలనే ఫార్ములాలు ముందు నుంచి వరుణ్ తేజ్ పెట్టుకోలేదు. కాబట్టే ఎఫ్2, ఎఫ్3 చిత్రాలు చేయగలిగాడు. ఇక, గత మూడు చిత్రాలు గని, ఆపరేషన్ వాలెంటైన్, గాంఢీవదారి అర్జున పరాజయాన్ని చూశాయి. అయినా, కొరియక్ కనరాజు లాంటి సినిమాను ఒప్పుకోవడం పెద్ద సాహసం. అది, వర్కౌట్ అయింది. మొత్తానికి సాలిడ్ హిట్ కొట్టాడు వరుణ్ తేజ్.

#varuntej#KoreanKanakaraju#MerlapakaGandhi#Rithikanayak#Sathya
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి