టాప్ న్యూస్

ISRO: ఇస్రోలో భారీ జీతంతో సైంటిస్ట్ ఉద్యోగాలు: అర్హతలు ఇవే!

రచన: Mamatha puppala5 నిమిషాల పఠనం

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO)కు చెందిన బెంగళూరులోని 'హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ సెంటర్' (HSFC) ప్రతిష్టాత్మక సైంటిస్ట్/ఇంజినీర్-ఎస్‌డీ (గ్రూప్-ఏ) పోస్టుల భర్తీకి దరఖాస్తులను కోరుతోంది. మొత్తం 6 ఖాళీల నియామకం కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు ప్రకటించింది. అంతరిక్ష, జీవశాస్త్రం మరియు బయోమెడికల్ పరిశోధనా రంగాలలో అగ్రశ్రేణి కెరీర్‌ను నిర్మించుకోవాలనుకునే పరిశోధకులకు ఇది గొప్ప అవకాశమని చెప్పవచ్చు.

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు బయోఇన్‌స్ట్రుమెంటేషన్, బయోఫిజిక్స్, మెడికల్ ఫిజిక్స్, డెవలప్‌మెంటల్ బయాలజీ, బయోటెక్నాలజీ, మాలిక్యులర్ బయాలజీ, కంప్యూటేషనల్ బయాలజీ, బయోఇన్ఫర్మేటిక్స్ లేదా బయోమెడికల్ ఇంజినీరింగ్/సైన్స్ వంటి సంబంధిత విభాగాలలో పీహెచ్‌డీ (PhD) ఉత్తీర్ణులై ఉండాలి. అర్హత గల అభ్యర్థులు ఆగస్టు 10, 2026 నుండి ఆన్‌లైన్‌లో దరఖాస్తు ప్రక్రియను ప్రారంభించవచ్చు.

అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ పూర్తిగా షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా కొనసాగుతుంది. స్వీకరించిన దరఖాస్తుల నుంచి అభ్యర్థుల విద్యార్హతలు, పరిశోధనా అనుభవాన్ని పరిశీలించి ప్రాథమికంగా షార్ట్‌లిస్ట్ చేస్తారు. అనంతరం వారికి ఇంటర్వ్యూ నిర్వహించి తుది ఎంపికను ఖరారు చేస్తారు. ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం పే-స్కేల్ వర్తిస్తుంది. ప్రతీ నెలా రూ.67,700 నుంచి గరిష్ఠంగా రూ.2,08,700 వరకు వేతనంతో పాటు ఇతర అలవెన్సులు, ప్రత్యేక సదుపాయాలు  దనున్నాయి. ఆసక్తి ఉన్న అభ్యర్థులు అధికారిక నోటిఫికేషన్‌లో వివరాలను నిశితంగా పరిశీలించి, ఆగస్టు 30, 2026 చివరి తేదీలోగా తమ ఆన్‌లైన్ దరఖాస్తులను సమర్పించాల్సి ఉంటుంది.

మానవ రహిత, సహిత అంతరిక్ష ప్రయోగాల (హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ ప్రోగ్రామ్) దిశగా ఇస్రో అత్యంత కీలకమైన పరిశోధనలు చేపడుతున్న నేపథ్యంలో ఈ నియామకాలకు ప్రాధాన్యత ఏర్పడింది. వ్యోమగాముల ఆరోగ్యం, అంతరిక్షంలో జీవశాస్త్ర పరమైన మార్పులు, బయోమెడికల్ పరికరాల పనితీరుపై పరిశోధనలకు అత్యున్నత స్థాయి నిపుణులు అవసరం కావడంతోనే ఇస్రో పీహెచ్‌డీ అభ్యర్థులను ఆహ్వానిస్తోంది. ఎంపికైన సైంటిస్టులు బెంగళూరులోని ప్రధాన పరిశోధనా కేంద్రంలో నేరుగా అంతరిక్ష ప్రాజెక్టులపై పనిచేసే అవకాశం పొందనున్నారు. ఈ ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి నోటిఫికేషన్, ఇతర దరఖాస్తు మార్గదర్శకాల కోసం అభ్యర్థులు ఇస్రో అధికారిక వెబ్‌సైట్‌ను https://www.isro.gov.in/ ను సందర్శించవచ్చు. 

#ISROJobs#ScientistJobs#ISRORecruitment2026#PhDJobs#HumanSpaceFlightCenter#TechJobsTelangana#Swechaanews
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి