తెలంగాణ

TG : ‘డబుల్’ జీతం.. ఆర్థికశాఖపై ఉద్యోగ సంఘాల ఆగ్రహం!

రచన: Kumar4 నిమిషాల పఠనం

కొందరు ఉద్యోగులు డబుల్ జీతాలు ఎత్తారన్న విషయం రాష్ట్రంలో సంచలనం రేపింది. ప్రభుత్వంలో పలు విభాగాల్లో ఈ దందా కొనసాగిందని ఆర్థిక శాఖ గుర్తించింది. ఆధార్ కార్డు ఒకటే.. కానీ, రెండు అకౌంట్ నంబర్లు ఇచ్చి.. రెగ్యులర్, అవుట్ సోర్సింగ్ విభాగాల్లో రెండు వేతనాలు ఎత్తారని తెలిసింది.

కొందరు ఉద్యోగులు డబుల్ జీతాలు ఎత్తారన్న విషయం రాష్ట్రంలో సంచలనం రేపింది. ప్రభుత్వంలో పలు విభాగాల్లో ఈ దందా కొనసాగిందని ఆర్థిక శాఖ గుర్తించింది. ఆధార్ కార్డు ఒకటే.. కానీ, రెండు అకౌంట్ నంబర్లు ఇచ్చి.. రెగ్యులర్, అవుట్ సోర్సింగ్ విభాగాల్లో రెండు వేతనాలు ఎత్తారని తెలిసింది.మొత్తానికి ఈ స్కాం వెలుగులోకి రావడంతో పెద్దఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఓ వైపు ఉద్యోగాలు రాక నిరుద్యోగులు పడిగాపులు గాస్తుంటే.. ప్రజల సొమ్మును కొందరు ఉద్యోగులు అక్రమంగా దోచారని.. దీనికి వెనుక కొందరు ఉన్నతాధికారుల హస్తం ఉందని ప్రచారం జరిగింది.

దాదాపు 40 మంది ఉద్యోగులు ప్రభుత్వం నుంచి ‘డబుల్ శాలరీ’ తీసుకున్నట్టు ఆర్థికశాఖ అధికారులు గుర్తించడంతో వారి మీద చర్యలకు రంగం సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది. ముందుగా ఈ అంశంలో విచారణకు ఆదేశించి, డూప్లికేట్ ఆధార్ మ్యాపింగ్‌ల ద్వారా ఇంకెవరెవరు జీతాలు ఎత్తారని గుర్తించే పనిలో అధికారులు నిమగ్నం అయ్యారు.ఇదిలాఉండగా, కొందరు ఉద్యోగులు పెద్ద మొత్తంలో రెండు జీతాలు ఎత్తడం వెనుక కారణాలను ఉద్యోగ సంఘాలు వెల్లడించడంతో పాటు ఆగ్రహంవ్యక్తం చేస్తున్నాయి.

పలువురు ముఖ్యనేతలు,మంత్రులు, ఉన్నతాధికారుల ఇళ్లలో పనిచేసే ఉద్యోగులకు డబుల్ జీతాల కోసం నకిలీ ఆధార్‌లతో రెండు జీతాలిస్తున్నట్టు పేర్కొన్నాయి. ప్రొటోకాల్ ఖర్చుల కోసం కూడా జీతాలు చెల్లిస్తున్నట్టు ఆరోపించాయి. ఆర్థికశాఖకు తెలిసే ఇదంతా జరుగుతోందని వెల్లడించాయి. కాగా, దీనిపై ఆర్థికశాఖ అధికారులు స్పందించాల్సి ఉంది. కాగా, ఉద్యోగులకు రెండు జీతాలు ఇవ్వడం.. ఆర్థికశాఖకు తెలిసే జరుగుతుండటంపై రాష్ట్రవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ప్రజాధనాన్ని ఇలా సొంత అవసరాల కోసం దుర్వినియోగం చేయడంపైనా సర్కారు సీరియస్ అయినట్టు తెలిసింది. డబుల్ జీతాలు ఎత్తినవారి మీద కేసులు పెట్టడం లేదా డబ్బులు రికవరీ చేయడం మీద అధికారులు కసరత్తు చేస్తున్నట్టు సమాచారం.

#dobule salary#finance department#aware#employee unions#hyderabad
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి