హైదరాబాద్ మహానగరంలో పెనువిషాదం కాస్త తృటిలో తప్పింది. ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించడంతో నగరవాసులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఏం జరిగిందోనని తేరుకోవడానికి స్థానికులకు చాలానే సమయం పట్టింది. పేలుడు ధాటికి ఒక్కసారిగా పరిసరాలు కంపించాయి. జనాలు భయంతో పరుగులు తీశారు. వాహనదారులు సైతం బెంబేలిత్తిపోయారు. ఈ దృశ్యాలు స్థానికంగా ఉన్న ఓ దుకాణంలోని సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. ప్రస్తుతం ఆ ఫుటేజీ బయటకు రావడంతో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంతకీ ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..
నగరంలో రోడ్డు పక్కన బెలూన్లు అమ్మే వ్యక్తి వద్దనున్న సిలిండర్ ఒక్కసారిగా పేలింది. మియాపూర్ పీఎస్ పరిధిలోని మదీనాగూడలో ఈ ఘటన జరింది. స్థానికంగా గల జీఎస్ఎం మాల్ పక్కన బెలూన్లలో గాలి నింపి ఓ వ్యక్తి విక్రయిస్తూ ఉండేవాడు. ఎప్పటిలాగే సదరు వ్యక్తి బెలూన్లలో గాలి నింపుతుండగా.. ఒక్కసారిగా సిలిండర్ బ్లాస్ట్ అయ్యింది.
https://x.com/pulsenewsbreak/status/2086267720593547321?s=20
ఈ ఘటనలో ముగ్గురికి గాయాలు అవ్వ్గా.. ప్రకాశ్ పాల్ అనే వ్యక్తికి సగం కాలు విరిగినట్టు సమాచారం. ఈ ఘటన అనంతరం బెలూన్లు విక్రయిస్తున్న వ్యక్తి అక్కడి నుంచి పరార్ అయినట్టు సమాచారం. అతను యూపీకి చెందిన వ్యక్తిగా గుర్తించారు. సిలిండర్‌లో కెపాసిటీకి మించి హీలియం గ్యాస్ నింపడం వల్లే ఈ ఘటన జరిగినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. స్థానికులు, బాధిత వ్యక్తుల స్టేట్మెంట్ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.పరారీలో ఉన్న వ్యక్తి కోసం గాలిస్తున్నట్టు సమాచారం.












