క్రైమ్

CRIME : బాలికలు, యువకులే టార్గెట్.. ఫోన్‌లో 600 అసభ్యకర వీడియాలు

రచన: Kumar4 నిమిషాల పఠనం

మైనర్లను టార్గెట్‌గా చేసుకుని వేధింపులకు గురిచేయడం, లైంగికదాడులకు పాల్పడటం వంటి ఘటనలకు పాల్పడుతున్న ఓ దుండగుడిని మహారాష్ట్ర పోలీసులు ఎట్టకేలకు అరెస్టు చేశారు. ముఖ్యంగా చిన్నారులను మచ్చిక చేసుకోవడం, ఆ తర్వాత అసభ్యకర వీడియోలు తీసి బ్లాక్ మెయిల్ చేసి లైంగికదాడులకు పాల్పడటమే సదరు వ్యక్తి నేర ప్రవృత్తిగా పోలీసులు గుర్తించారు.

మైనర్లను టార్గెట్‌గా చేసుకుని వేధింపులకు గురిచేయడం, లైంగికదాడులకు పాల్పడటం వంటి ఘటనలకు పాల్పడుతున్న ఓ దుండగుడిని మహారాష్ట్ర పోలీసులు ఎట్టకేలకు అరెస్టు చేశారు. ముఖ్యంగా చిన్నారులను మచ్చిక చేసుకోవడం, ఆ తర్వాత అసభ్యకర వీడియోలు తీసి బ్లాక్ మెయిల్ చేసి లైంగికదాడులకు పాల్పడటమే సదరు వ్యక్తి నేర ప్రవృత్తిగా పోలీసులు గుర్తించారు. దీనికి తోడు పలువురు యువకులను సైతం నిందితుడు లైంగికంగా వేధించినట్టు తెలిసింది.

వివరాల్లోకివెళితే.. చేతన్ ప్రకాశ్ కోలీ (22) మైనర్లను లక్ష్యంగా చేసుకుని లైంగిక వేధింపులకు పాల్పడుతున్నట్టు పోలీసులకు ఫిర్యాదు అందింది. అతని కోసం గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులు మహారాష్ట్రలోని నందుర్బార్ పీఎస్ పరిధిలో అరెస్టు చేశారు.నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారించగా ఆశ్చర్యకర విషయాలు వెలుగులోకి వచ్చాయి. ప్రకాశ్ కోలి గత నాలుగేళ్లుగా ఇలాంటి అకృత్యాలకు పాల్పడుతున్నట్లు జిల్లా ఎస్పీ వెల్లడించారు. పేదరికం, మైనర్ల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని, డబ్బుల ఆశ చూపి బాలికలను తనవైపునకు తిప్పుకునేవాడని పేర్కొన్నారు.

ఆ తర్వాత లైంగిక వేధింపులకు పాల్పడటం, ఆ దృశ్యాలను ఫోన్‌లో వీడియోలు తీసి బ్లాక్‌మెయిల్ చేసేవాడని పోలీసులు వెల్లడించారు. నిందితుడి ఫోన్‌ను స్వాధీనం చేసుకుని పరిశీలించిన పోలీసులు ఒక్కసారిగా షాక్‌కు గురైనట్టు తెలిసింది. ఎందుకంటే అతడి ఫోన్లో ఏకంగా 600కు పైగా అసభ్యకర వీడియోలు ఉన్నట్టు గుర్తించారు.బాధిత మైనర్ కుటుంబాల ఫిర్యాదు ఆధారంగా ఈ ఘటనపై విభిన్న కోణాల్లో సమగ్ర దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.

ఇదిలాఉండగా, మహారాష్ట్రలో గతంలోనూ ఇలాంటి ఘటనే ఒకటి వెలుగుచూసింది. సుమారు 180 మంది మైనర్ బాలికలను లైంగికంగా వేధించి, వారి జీవితాలతో ఆడుకున్న మొహమ్మద్ అయాజ్ (అలియాస్ తన్వీర్) అనే వ్యక్తిని అమరావతి జిల్లాలోని పరట్వాడా సిటీలో పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. వాట్సాప్, స్నాప్‌చాట్ గ్రూపుల ద్వారా అమాయక మైనర్ బాలికలను టార్గెట్ చేసిన తన్వీర్.. ప్రేమ పేరుతో నమ్మించి వారిని ముంబై, పూణే వంటి నగరాలకు తీసుకెళ్లి లైంగికంగా వేధించేవాడు. అతని ఫోన్లో 350 అసభ్యకర వీడియోలను పోలీసులు గుర్తించారు.

#minor girls & boys target#sexual harrasment#blackmail#maharastra#criminal arrest
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి