తెలంగాణ

TG : ఆదివాసీల ఆత్మగౌరవం, హక్కుల కోసం మనమంతా కలిసి నిలబడాలి : సీఎం రేవంత్

రచన: Kumar4 నిమిషాల పఠనం

ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని పురస్కరించుకుని సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు. ప్రపంచ నాగరికతకు మూలం, ప్రకృతితో మమేకమైన జీవన విధానం - ఆదివాసీ సంస్కృతి అని కొనియాడారు. తరతరాలుగా ప్రకృతి పరిరక్షణను తమ జీవన విధానంగా మలుచుకున్న ఆదివాసీ సమాజాల జ్ఞానం, సంస్కృతి, సంప్రదాయాలు, సమిష్టి జీవన విధానం, సాంస్కృతిక పరిరక్షణ యావత్ మానవాళికి మార్గదర్శకం అని పేర్కొన్నారు.

ప్రపంచ ఆదివాసీ దినోత్సవం పురస్కరించుకుని ప్రకృతిని దైవంగా, అడవిని తల్లిగా, తమ సంస్కృతి సంప్రదాయాలను తరతరాలుగా కాపాడుకుంటున్న ఆదివాసీ సోదర సోదరీమణులకు సీఎం శుభాకాంక్షలు తెలిపారు. వారి హక్కులను, అస్తిత్వాన్ని, సంస్కృతిని గౌరవిస్తూ వారి సంక్షేమం, అభివృద్ధి, ఆత్మగౌరవం కోసం మనమంతా కలిసి నిలబడాలని పేర్కొన్నారు. జల్-జంగల్-జమీన్ పరిరక్షణలో వారి స్ఫూర్తి సదా ఆదర్శం అని కొనియాడారు. ఈ మేరకు సీఎంవో కార్యాలయం ట్వీట్ చేసింది.

రాష్ట్ర ప్రజలకు బోనాల శుభాకాంక్షలు..

తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బోనాల పండుగ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ సీఎం రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. శక్తి స్వరూపిణి, లాల్ దర్వాజా శ్రీ సింహవాహిని మహంకాళి అమ్మవారి కరుణాకటాక్షాలు ప్రతి కుటుంబంపై ఎల్లప్పుడూ ఉండాలని ప్రార్థించారు.

అమ్మవారి ఆశీస్సులతో ప్రతి ఇంటా ఆరోగ్యం, ఆనందం, ఐశ్వర్యం, సుఖసంతోషాలు వెల్లివిరియాలని, ప్రజలందరూ సుఖశాంతులతో, ఐకమత్యంతో, సౌభాగ్యంతో జీవించాలని ఆకాంక్షించారు. భక్తిశ్రద్ధలతో అమ్మవారిని కొలుస్తూ, మన సంస్కృతి, సంప్రదాయాల వైభవాన్ని చాటుతూ బోనాల పండుగను భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలని కోరారు.

#Cm revanth reddy#world adivasi day#telangana people#wishes
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి