Varanasi: నేడు (ఆగస్టు 9) సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టినరోజు. ఈ నేపథ్యంలో వారణాసి సినిమా నుంచి క్రేజీ అప్‌డేట్ ఇచ్చాడు దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి. ఆయన దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోంది వారణాసి. గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా నటిస్తోంది. పృథ్విరాజ్ సుకుమారన్ విలన్ పాత్రలో కనిపించబోతున్నాడు.
మహేష్ రుద్ర, శ్రీరాముడి పాత్రల్లో..ప్రియాంక మందాకినిగా, పృథ్విరాజ్ కుంభ పాత్రల్లో నటిస్తున్నారు. పాన్ వరల్డ్ సినిమాగా 2027 ఏప్రిల్ 7వ తేదీన 120 దేశాలలో 20 భాషల్లో వారణాసి సినిమా రాబోతుంది. అయితే, మహేష్ పుట్టినరోజు సందర్భంగా ఆగస్టు 9న ఈ సినిమా నుంచి టీజర్ వస్తుందని అందరూ ఆశించారు. కానీ, రాజమౌళి డిసప్పాయింట్ చేశాడు. విజువల్ ట్రీట్ ఏదీ ఇవ్వలేదు.
కానీ, ఆఫ్రికాలో షూట్ చేసిన సమయంలో తీసిన కొన్ని ఫొటోలను మాత్రం రివీల్ చేశాడు. పోనిలే, కనీసం ఈ ఫొటోస్ అయినా చూపించాడు..అని మహేష్ ఫ్యాన్స్ వాటినే షేర్ చేసుకుంటున్నారు. ఇక, మహేష్ ఆఫ్రికా షెడ్యూల్‌లో తీసిన ఫొటోస్ మాత్రం హాలీవుడ్ హీరోలా ఉన్నాయి. గ్యారెంటీగా మహేష్ లుక్స్ సినిమాకి హైలెట్‌గా నిలవనున్నాయని అర్థమవుతోంది.

ఇక, మహేష్ కి బర్త్ డే విషెస్ తెలుపుతూ వారణాసి సినిమాలోని పాత్ర గురించి ట్వీట్ ద్వారా వెల్లడించాడు జక్కన్న. “రుద్ర తన జీవితానికి మించి ఓ గొప్ప కార్యాన్ని చేయడానికి పుట్టిన ఓ కారణ జన్ముడు. తను అడగని విధిని మోస్తాడు. రుద్ర చమత్కారిగా కనిపిస్తాడు.. అలాగే సాఫ్ట్ గా కనిపిస్తాడు. అంతేకాదు, ఒక రుద్రుడిగానూ కనిపిస్తాడు. రౌద్రంగా ఎవరైనా చేస్తారు.. కానీ సున్నితత్వంతో పాటుగా చాలా తక్కువమంది కనిపిస్తారు. అలాంటి వారిలో ఒక్క మహేష్ మాత్రమే చెయ్యగలడు” అని రాజమౌళి ట్వీట్ లో రాసుకొచ్చాడు.
ఈ ఫ్రేమ్‌లు, మా ఆఫ్రికా షెడ్యూల్ లో తీసినవి.. ఏ సెట్ కూడా ఇవ్వలేని ఓ గొప్ప అనుభూతిని ఈ ప్రదేశం మాకు ఇచ్చింది. కిలిమంజారో, మసాయి మారాలో షూట్ చేస్తుండగా, నేను అవక్కాయ్యాను. కొన్ని పిక్చర్స్ ని 1.43:1 ఐమాక్స్ ఫ్రేమ్ కూడా బంధించలేదేమో అని నాకు అనిపించింది..అంటూ మహేష్ లుక్స్ గురించి రాజమౌళి చెప్పుకొచ్చాడు. ఇప్పటి వరకూ ఒక్క ఫ్లాప్ కూడా చూడని రాజమౌళి..ఈ సారి గ్లోబల్ మార్కెట్‌ని షేక్ చేయడానికి రెడీ అవుతున్నాడు.












