National

ఇరాన్ సుప్రీం లీడర్ ఆరోగ్యంపై సస్పెన్స్.. వీడియో వచ్చినా వీడని సందేహాలు!

రచన: Mamatha puppala4 నిమిషాల పఠనం

ఇరాన్ అత్యున్నత ఆధ్యాత్మిక నేత (సుప్రీం లీడర్) ముజ్తాబా ఖమేనీ ఆరోగ్య పరిస్థితిపై ప్రపంచవ్యాప్తంగా ఉత్కంఠ కొనసాగుతోంది. ఆయన తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారని, అత్యవసర చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారంటూ ఇజ్రాయెల్ వార్తా సంస్థలు ప్రసారం చేసిన కథనాలతో ఒక్కసారిగా కలకలం రేగింది.

ఇరాన్ అత్యున్నత ఆధ్యాత్మిక నేత (సుప్రీం లీడర్) ముజ్తాబా ఖమేనీ ఆరోగ్య పరిస్థితిపై ప్రపంచవ్యాప్తంగా ఉత్కంఠ కొనసాగుతోంది. ఆయన తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారని, అత్యవసర చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారంటూ ఇజ్రాయెల్ వార్తా సంస్థలు ప్రసారం చేసిన కథనాలతో ఒక్కసారిగా కలకలం రేగింది. ఈ వార్తలను ఖండిస్తూ ఇరాన్ ప్రభుత్వ అనుబంధ 'మెహర్ న్యూస్ ఏజెన్సీ' ఆయన ఆరోగ్యంగా ఉన్నారని తెలిపే ఒక ప్రత్యేక వీడియోను శనివారం రాత్రి విడుదల చేసింది.

అయితే, ఇరాన్ మీడియా బయటపెట్టిన 12సెకన్ల నిడివి గల ఆ వీడియో అనుమానాలను నివృత్తి చేయకపోగా మరిన్ని కొత్త ప్రశ్నలను తెరపైకి తెచ్చింది. అందులో ముజ్తాబా ఖమేనీ కొందరు అధికారులతో ప్రశాంతంగా మాట్లాడుతున్నట్లు కనిపించినప్పటికీ, ఆ దృశ్యాలు ఎప్పుడు చిత్రీకరించారో తెలిపే తేదీ గానీ, స్పష్టమైన ఆధారాలు గానీ లేవు. దీంతో అది యుద్ధం ప్రారంభం కావడానికి కంటే ముందే 'కోమ్' నగరంలో చిత్రీకరించిన పాత వీడియో అయి ఉంటుందని అంతర్జాతీయ విశ్లేషకులు, సామాజిక మాధ్యమాల వేదికగా పలువురు బలంగా ఆరోపిస్తున్నారు.

తన తండ్రి మరణానంతరం అత్యున్నత నేతగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ముజ్తాబా ఒక్కసారి కూడా ప్రత్యక్షంగా ప్రజల ముందుకు రాకపోవడం ఈ అనుమానాలకు మరింత ఊతమిస్తోంది. స్వయంగా ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సుప్రీం లీడర్‌తో నేరుగా సంప్రదింపులు జరపడం "చాలా కష్టంగా మారింది" అని అంగీకరించడం గమనార్హం. ఇరాన్ ప్రాధికార వర్గాల్లోనే ఆయన ఆరోగ్యంపై తీవ్ర స్థాయిలో భయాందోళనలు వ్యక్తమవుతున్నట్లు కొన్ని అంతర్జాతీయ పత్రికలు ఉటంకించాయి.

ప్రస్తుతం చోటుచేసుకుంటున్న పరిణామాల నేపథ్యంలో, తాజా వీడియో విడుదల కూడా ఇరాన్ ప్రజల్లోనూ, అంతర్జాతీయ సమాజంలోనూ ఉన్న అభద్రతాభావాన్ని ఎంతమాత్రం తొలగించలేకపోయింది. దేశంలో సంక్షోభం తలెత్తకుండా పరిస్థితులను అదుపులో ఉంచేందుకే ఇరాన్ ప్రభుత్వం ఇటువంటి విఫల ప్రయత్నాలు చేస్తోందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ముజ్తాబా ఖమేనీ నేరుగా సభల్లో పాల్గొంటేనే తప్ప ఈ మిస్టరీకి తెరపడే అవకాశం కనిపిలేదని తెలుస్తోంది.

https://x.com/theinformant_x/status/2086290372871717352?s=20

 

#DharmendraPradhan#NEETControversy#OdishaPolitics#NaveenPatnaik#UnionMinisterResignation#NationalNews#swechaanews
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి