తెలంగాణ

గ్రేటర్ ప్రజలకు అలర్ట్.. ‘ఇందిరమ్మ టవర్స్’ దరఖాస్తులకు ముగుస్తున్న గడువు!

రచన: Mamatha puppala4 నిమిషాల పఠనం

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన ‘ఇందిరమ్మ ఇళ్ల టవర్స్’ పథకం కింద ఇళ్లు పొందాలనుకునే అర్హులకు కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. గ్రేటర్ హైదరాబాద్ (జీహెచ్‌ఎంసీ) పరిధిలోని పేద, దిగువ మధ్యతరగతి వర్గాల కలల ఇంటిని నిజం చేసేందుకు ఉద్దేశించిన ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి కేవలం మరో రెండు రోజులు మాత్రమే సమయం మిగిలి ఉందని హౌసింగ్ బోర్డు వైస్ చైర్మన్, కమిషనర్ వీపీ గౌతమ్ స్పష్టం చేశారు.

రాజధానిలోని 16 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో మొత్తం 7,680 ఎల్‌ఐజీ (LIG) ఫ్లాట్ల కేటాయింపు లక్ష్యంగా ప్రభుత్వం ఈ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అర్హులైన అభ్యర్థులు ఆగస్టు 10 (సోమవారం) నాటికి దరఖాస్తుల ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు. ఈ పథకానికి ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తుండగా, శనివారం నాటికి రాష్ట్రవ్యాప్తంగా సుమారు 35,125 దరఖాస్తులు సమర్పించబడినట్లు కమిషనర్ వెల్లడించారు.

ఒక్కో ఫ్లాట్ అసలు నిర్మాణ వ్యయం రూ.11 లక్షలు కాగా, ప్రభుత్వం రూ.5 లక్షల సబ్సిడీ సాయం అందిస్తూ నిరుపేదలకు అండగా నిలుస్తోంది. స్వీకరించిన దరఖాస్తులను సమగ్రంగా పరిశీలించిన అనంతరం ఆగస్టు 30న పూర్తిస్థాయి కంప్యూటరైజ్డ్ లాటరీ పద్ధతి ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేస్తారు. ఇందులో ఎంపికైన వారికి నిర్దేశిత ఏడాది కాలంలోనే ఇళ్లను నిర్మించి అందజేస్తామని ప్రభుత్వం భరోసా ఇచ్చింది.

 ఒకవేళ లాటరీలో ఇల్లు రాని పక్షంలో అభ్యర్థులు దరఖాస్తు సమయంలో చెల్లించిన రూ.10వేల డిపాజిట్ మొత్తాన్ని నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లోకే తిరిగి వాపస్ చేయనున్నారు. ఈ సువర్ణావకాశాన్ని అర్హులైన పేద ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఇందుకు ఆసక్తి గల అభ్యర్థులు ఏమాత్రం ఆలస్యం చేయకుండా సమీపంలోని మీసేవ కేంద్రాల ద్వారాగానీ లేదా అధికారిక ఆన్‌లైన్ పోర్టల్ ద్వారాగానీ తమ దరఖాస్తులను వెంటనే సమర్పించాల్సిందిగా హౌసింగ్ బోర్డు అధికారులు విజ్ఞప్తి చేశారు.

#IndirammaHouses#GHMCNews#TelanganaHousing#IndirammaTowers#HyderabadRealEstate#TelanganaGovt#swechaanews
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి