Geetu Mohandas: ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంతా ట్రెండింగ్‌లో ఉన్న ట్రైలర్ ఏదైనా ఉందీ అంటే ఒక్క టాక్సిక్ మాత్రమే. మాఫియా నేపథ్యం, అండర వరల్డ్, యాక్షన్, రొమాన్స్, సర్కస్ నేపథ్యం..ఇలా చాలా జానర్స్‌ని కలిసి లేడీ డైరెక్టర్ గీతూ మోహన్‌దాస్ ఈ చిత్రాన్ని రూపొందించారు. ఇలాంటి, సినిమాను హాలీవుడ్ డైరెక్టర్స్, లేదా మన సౌత్‌లో రాజమౌళి, ప్రశాంత్ నీల్ లాంటి వారు తీస్తారు.
ఇది, గీతూ మోహన్‌దాస్ సినిమా అని ప్రత్యేకంగా చెప్పడానికి ఎన్నో అంశాలున్నాయి. ముఖ్యంగా కాస్టింగ్ గురించి మాట్లాడుకోవాలి. సౌత్ అండ్ బాలీవుడ్ స్టార్స్‌ని డైరెక్ట్ చేయడం అంటే ఆషామాషీ కాదు. ఇక్కడే, గీతూ సక్సెస్ అయింది. ఇక, యష్ లాంటి ఒక సునామీని డైరెక్ట్ చేయడం అంటే జీవితంలోనే మర్చిపోలేని అనుభూతి. కేజీఎఫ్ సిరీస్ తర్వాత వచ్చే సినిమా మీద ఎన్నో అంచనాలుంటాయి.
ముఖ్యంగా, దర్శకులకి పెద్ద ఛాలెంజ్..అండ్ అతిపెద్ద ప్రజర్. ఇలాంటి వన్నీ తట్టుకొని టాక్సిక్ చిత్రాన్ని తీసింది గీతూ మోహన్‌దాస్. తాజాగా, బెంగుళూరులో ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. యష్‌తో పాటు చిత్రంలో నటించిన ప్రధాన తారాగణమంతా ఈ గ్రాండ్ ఈవెంట్‌కి హాజరయ్యారు. ఈ సందర్భంగా, గీతూ..టాక్సిక్ జర్నీని గుర్తు చేసుకుంది.
ముఖ్యంగా, యష్ గురించి మాట్లాడుతూ.. చాలా ఎమోషనల్ అయింది. యష్..ఒక కో స్టార్..ఒక రైటర్..ఒక ప్రొడ్యూసర్ మాత్రమే కాదు. నాకు ఒక ఎమోషన్ అని తెలిపింది. టాక్సిక్ సినిమా ప్రయాణంలో యష్ ద్వారా ఎన్నో విషయాలను నేచుకున్నాని చెప్పుకొచ్చింది. నేను తర్వాత తీసే ప్రతీ సినిమాపై యష్ ప్రభావం ఉంటుందని అన్నారు. ఇక, ఈ సినిమాలో నటించిన నయనతార, హ్యూమ ఖురేషి, కియారా, రుక్మిణి వసంత్, తారా సుతారియాలతో వర్క్ చేయడం చాలా ఆనందంగా ఉంది..కంటికి కనిపించని టెక్నికల్ టీమ్ అందరూ ఎంతో శ్రమించారు. వారందరికీ నా కృతజ్ఞతలు.
ఇక, ఈ సినిమాలో డైలాగ్స్ అన్నీ బాగా గుర్తు పెట్టుకొని చెప్ప గలిగింది ప్రొడ్యూస్ వెంకట్ మాత్రమే. ప్రొడక్షన్ పరంగా ఆయన ఇచ్చిన సపోర్ట్ చాలా గొప్పది. ఆయన లేకపోతే ఈ సినిమా సాధ్యమయ్యేదే కాదు. టాక్సిక్ ఇంత బాగా రావడానికి వెంకట్ ఖర్చుకు వెనకాడకుండా అడిగిన ప్రతీది ఇవ్వడమే.. అని తెలిపింది గీతూ మోహన్‌దాస్. కాగా, ఈ సినిమాను ఆగస్టు 26వ తేదీన ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయనున్నారు.












