Health

Health: వర్షాకాలం.. మిగిలిన ఆహారాన్ని వేడి చేసి తింటున్నారా?..

రచన: Venu4 నిమిషాల పఠనం

వర్షాకాలంలో ఆహారాన్ని ఎక్కువసేపు బయట ఉంచకుండా.. శుభ్రంగా, తగిన ఉష్ణోగ్రతలో నిల్వ చేయడం చాలా ముఖ్యం అని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఇక చల్లారిన ఆహారాన్ని వేడి చేయడం తప్పు కాదు.. కానీ సరిగ్గా నిల్వ చేయని ఆహారాన్ని మళ్లీ వేడి చేసి తినడం మాత్రం ప్రమాదకరం.

వర్షాకాలంలో ఆహారం విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అయితే చల్లారిన ప్రతి ఆహారాన్ని మళ్లీ వేడి చేస్తే విషపూరితం అవుతుందనేది నిజం కాదు. అసలు సమస్య ఆహారాన్ని ఎలా నిల్వ చేశాం, ఎంతసేపు బయట ఉంచాం, ఎంతసార్లు రీహీట్ చేశాం అన్నదే ముఖ్యమని అంటున్నారు..

ముందుగా అన్నం విషయానికి వస్తే.. వండిన అన్నాన్ని గది ఉష్ణోగ్రతలో ఎక్కువసేపు ఉంచితే Bacillus cereus అనే బ్యాక్టీరియా పెరిగే అవకాశం ఉంటుంది. ఇవి ఉత్పత్తి చేసే కొన్ని టాక్సిన్లు మళ్లీ వేడి చేసినా పూర్తిగా నశించకపోవచ్చు. అందుకే అన్నాన్ని వండిన గంటలోపే చల్లార్చి ఫ్రిజ్‌లో పెట్టాలి. సాధ్యమైనంత త్వరగా, 24 గంటల్లోపు తినడం మంచిది. రీహీట్ చేస్తే ఒకసారి మాత్రమే వేడి చేసి తినాలని నిపుణులు సూచిస్తున్నారు..

ఇక చికెన్, మటన్, చేపలు వంటి నాన్‌వెజ్ వంటకాలను కూడా బయట ఉంచి మళ్లీ మళ్లీ వేడి చేయడం సురక్షితం కాదంటున్నారు.. అలాగే ఆకు కూరలు, పుట్టగొడుగులు, బంగాళదుంపలు, ఉడికించిన గుడ్లు వంటి వాటిని పదేపదే వేడి చేసి తినడం ఆరోగ్యకరం కాదని చెబుతున్నారు. అలాగే ఈ పదార్థాలను సరిగ్గా నిల్వ చేయకపోతే బ్యాక్టీరియా పెరిగి ఫుడ్ పాయిజనింగ్‌కు కారణమవుతుందని అంటున్నారు.

ముఖ్యంగా వర్షాకాలంలో ఆహారాన్ని ఎక్కువసేపు బయట ఉంచకుండా.. శుభ్రంగా, తగిన ఉష్ణోగ్రతలో నిల్వ చేయడం చాలా ముఖ్యం అని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఇక చల్లారిన ఆహారాన్ని వేడి చేయడం తప్పు కాదు.. కానీ సరిగ్గా నిల్వ చేయని ఆహారాన్ని మళ్లీ వేడి చేసి తినడం మాత్రం ప్రమాదకరం. అనుమానం ఉన్న ఆహారం విషయంలో తినకుండా పారేయడమే సురక్షితమైన మార్గం అని ఆరోగ్యనిపుణులు పేర్కొంటున్నారు..

ముఖ్య గమనిక: ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసం మాత్రమే. ఇది నిపుణుల లేదా వైద్యుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించిన ఎలాంటి నిర్ణయాలైనా తీసుకునే ముందు ఖచ్చితంగా మీ డాక్టర్‌ను సంప్రదించాల్సిందిగా మనవి!..

#Health#Monsoon season#reheating#eating#over#food
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి