సినిమా

The Paradaise: నాని నటిస్తుంది కన్నడ సినిమా కాదు..నెటిజన్‌కి ఇచ్చిపడేసిన కీర్తి..

రచన: Anshu4 నిమిషాల పఠనం

The Paradaise: కీర్తి సురేష్ కి తెలుగులో చాలానే గ్యాప్ వచ్చింది. దసరా సినిమాతో హిట్ అందుకున్న కీర్తికి, భోళా శంకర్ మాత్రం తీవ్ర నిరాశకి గురి చేసింది. మెగాస్టార్ సినిమా అని ఒప్పుకుంటే, ఇలాంటి ఫలితం వచ్చిందని షాకైంది. అసలు, ఈ సినిమాలో కీర్తిని చిరు సోదరిగా చూసేందుకు ఇష్టపడలేదు. అసలు, భోళా శంకర్ కథ తమిళంది. అక్కడ అజిత్ చేసి హిట్ కొడితే, దాన్ని తెలుగులో తీయడం పెద్ద పొరపాటు.

ఆ తర్వాత, మళ్ళీ కీర్తి సురేష్ తెలుగు సినిమాలలో అవకాశాలు రాలేదు. కొంత విరామం తర్వాత దిల్ రాజు నిర్మాణంలో విజయ్ దేవరకొండ నటిస్తున్న రౌడీ జనార్ధన మూవీలో ఎంపికైంది. ఈ సినిమా ఓపెనింగ్‌లో కీర్తి నాభి అందాలతో కాస్త ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. ఇక, ఇటీవల అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్-కళ్యాణ్ రామ్ హీరోలుగా రూపొందుతున్న సినిమాలోనూ ఎంపికైంది. ఈ మూవీ ఓపెనింగ్‌లో కీర్తి అందాలతో ఆకట్టుకుంది.

ఈ సినిమాలో వెంకటేష్‌కి జంటగా నటిస్తోంది. ఇవి, కాకుండా ఇతర భాషలలోనూ కొత్త ప్రాజెక్ట్స్ చేస్తోంది. ఇలాంటి, సమయంలో ఐటమ్ సాంగ్ ఒప్పుకోవడం కాస్త ఫ్యాన్స్ జీర్ణించుకోలేని విషయం. నాని-శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో రూపొందుతున్న పాన్ ఇండియన్ సినిమా ది ప్యారడైజ్ మూవీలో కీర్తి స్పెషల్ సాంగ్ చేసింది. ఇటీవలే ఆ సాంగ్ షూటింగ్ కూడా పూర్తైంది.

అయితే, ఇన్స్టాలో దీనికి సంబందించి కొందరు రక రకాలుగా మాట్లాడుతున్నారు. ఒక నెటిజన్..కీర్తికి హీరోయిన్‌గా అవకాశాలు లేకపోవడంతోనే నాని నటిస్తున్న కన్నడ సినిమాలో ఐటమ్ సాంగ్ ఒప్పుకుంది అని మాట్లాడింది. దీనికి, కీర్తి సీరియస్ అవలేదు. పైగా చిన్న స్మైల్ ఇచ్చి..స్మాల్ కరెక్షన్..నాని నటిస్తుంది కన్నడ సినిమా కాదు..తెలుగు సినిమా అంటూ క్లారిటీ ఇచ్చింది. దీంతో, అటు నెటిజన్ కి సమాధానమిచ్చింది..ఇటు తానూ ప్యారడైజ్ లో ఐటమ్ సాంగ్ చేసిన విషయాన్ని కన్‌ఫర్మ్ చేసింది. కాగా, ఈ సినిమాను సెప్టెంబర్ 24న 7 భాషలలో రిలీజ్ చేయనున్నారు. కయాదు లోహర్ హీరోయిన్‌గా నటించింది.

#KeerthySuresh#Nani#TheParadaise#SrikanthOdela#KayaduLohar
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి