Nayanathara: సౌత్ సినిమా ఇండస్ట్రీలో లేడీ సూపర్ స్టార్‌గా అసాధారణమైన పాపులారిటీని సంపాదించుకుంది నయనతార. చంద్రముఖి సినిమాతో సౌత్ క్వీన్‌గా పాపులర్ అయిన నయన్..ఆ తర్వాత, గజిని సినిమాలో కీలకమైన పాత్రను పోషించింది. కెరీర్ ప్రారంభంలోనే టాలీవుడ్, కోలీవుడ్ అగ్ర నథానాయకులందరి సరసన నటించింది. చాలామంది హీరోలకి నయన్ హిట్ పెయిర్.
అయితే, ఆమె తన కెరీర్ ప్రారంభంలో రెండు మూడు సినిమాలకి కూడా ప్రమోషన్స్‌కి హాజరవలేదు. సినిమా పూర్తి చేయడం వరకే తప్ప ఏ ప్రమోషనల్ ఈవెంట్‌లోనూ పాల్గొనలేదు. దానికి, సమాధానం కూడా ఒకసారి చెప్పింది. నయన్ నటించిన ఒక సినిమా ప్రమోషన్స్‌కి వెళ్ళింది. ఆ సినిమా ఫ్లాపైంది. దాంతో, అప్పటి నుంచి ప్రమోషన్స్‌ను అవైడ్ చేస్తూ వస్తోంది. అలా, వెళ్ళని చాలా సినిమాలు సూపర్ హిట్ అయ్యాయని కూడా చెప్పింది.
అయితే, అనిల్ రావిపూడి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటించిన మన శంకరవరప్రసాద్‌గారు చిత్రాన్ని మాత్రం బాగా ప్రమోట్ చేదింది. దీనికి, కారణం అనిల్ రావిపూడి అని చెప్పింది. ఇప్పుడు, టాక్సిక్ ట్రైలర్ ఈవెంట్‌లో పాల్గొంది. ఇదే ప్రశ్న మళ్ళీ పునరావృతం అయింది. అందుకు, సమాధానంగా.."నేను నిజంగానే ఏ సినిమా ప్రమోషన్స్‌కి రాను. దీనికి, కారణం నాకు స్టేజ్ మీద మాట్లాడటం రాదు. కానీ, యష్ కాల్ చేసి రమ్మన్నాడు. ఇలా తను అడిగిన ఒక్క మాటకే వచ్చేశాను" అని చెప్పింది. అలాగే, టాక్సిక్ తనకి ఎంతో ప్రతేకమైనదని కూడా నయన్ ఈ సందర్భంగా చెప్పుకొచ్చింది..
కాగా, కన్నడ రాకింగ్ స్టార్ యష్ డ్యూయల్ రోల్‌లో నటించిన ఈ హెవీ హై ఓల్టేజ్ యాక్షన్ సినిమా టాకిక్స్. గీతూ మోహన్‌దాస్ దర్శకత్వం వహించగా కేవీఎన్ ప్రొడక్షన్స్ భారీ బడ్జెట్‌తో నిర్మించింది. నయనతార, కియారా అద్వానీ, తారాసుతారియా, హ్యూమా ఖురేషి, రుక్మిణి వసంత్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ ఆగస్టులో పాన్ ఇండియా వైడ్‌గా రిలీజ్ కానుంది.












