NTRivikram: ఎన్టీఆర్-త్రివిక్రమ్ లది టాలీవుడ్ లో ఉన్న క్రేజీ కాంబినేషన్స్‌లో ఒకటి. గతంలో వీరిద్దరు కలిసి అరవింద సమేత వీర రాఘవ చిత్రం చేసి మంచి కమర్షియల్ సక్సెస్‌ను అందుకున్నారు. ఈ సినిమాలో తారక్ ని గురూజీ చూపించిన హైప్ కి నందమూరి అభిమానులు ఎంతో ఫిదా అయ్యారు. అప్పటి నుంచి మళ్ళీ వీరి కాంబినేషన్‌లో సినిమా రావాలని కోరుకున్నారు.
కానీ, ఇన్నేళ్ళ వరకూ ఆ ప్రాజెక్ట్ సెట్ కాలేదు. ఇంతకాలానికి ఎన్టీఆర్-త్రివిక్రమ్ కాంబోలో భారీ పాన్ ఇండియా సినిమాను ప్రకటించారు. ఈ సినిమాను ప్రకటించి కూడా ఏడాది కావస్తుంది. కథ కూడా ఫైనల్ అయింది. దీనికి సంబందించి తారక్ కూడా హిస్టరీ తెలుసుకుంటున్నాడు. ముఖ్యంగా సుబ్రమణ్య స్వామీ గ్రంధాలను చదివే పనిలో ఉన్నాడు. టైటిల్ గా కూడా గాడ్ ఆఫ్ వార్ అని ప్రచారంలో ఉంది.
వాస్తవానికి, ఈ సినిమా షూటింగ్ ఈ ఏడాది మొదలవుతుందని అందరూ అనుకున్నారు. ఎన్టీఆర్-త్రివిక్రమ్ కూడా ఆ రకంగానే ప్లాన్ చేశారు. కానీ, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తారక్ డ్రాగన్ సినిమా చేస్తున్న కారణంగా కొంత ఆలస్యం అయితే, ఈ సినిమా షూటింగ్ సమయంలో భుజానికి గాయం అయి..దాదాపు రెండు నెలల పాటు షూటింగ్ కి తారక్ హాజరు కాలేని పరిస్థితి.
దీంతో, ఆ ఎఫెక్ట్ ఎన్టీఆర్-త్రివిక్రమ్ ప్రాజెక్ట్ మీద పడింది. డ్రాగన్ పూర్తయ్యే సరికే ఈ ఏడాది కంప్లీట్ అవుతుంది. లేదంటే వచ్చే ఏడాది మార్చ్ కూడా అవొచ్చు. అందుకే, ఎన్టీఆర్-త్రివిక్రమ్ సినిమాను 2027 సెకండాఫ్ లో ప్లాన్ చేస్తున్నారట. సమ్మర్ తర్వాత ప్రీ ప్రొడక్షన్ వర్క్ పూర్తి చేసి 2027 ఏడాది చివరన గాడ్ ఆఫ్ వార్ సెట్స్ పైకి తీసుకు రావాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్టుగా సమాచారం. మొత్తానికి, ఎన్టీఆర్ కి గాయం కావడంతో త్రివిక్రమ్ సినిమా బాగానే ఆలస్యం అవుతోంది.












