సినిమా

Toxic Trailer: కన్న కొడుకుతోనే యుద్ధం..ట్రైలర్ మొత్తం రక్తపాతం

రచన: Anshu4 నిమిషాల పఠనం

Toxic Trailer: కన్నడ సినిమా ఇండస్ట్రీ గురించి మాట్లాడాల్సి వస్తే ముందు యష్ గురించి చెప్పుకోవాల్సిందే. కేజీఎఫ్ సిరీస్‌తో కన్నడ సినిమా ఇండస్ట్రీనే శాసించాడు. ఆ రకంగా రాకింగ్ స్టార్ ఇమేజ్ ని పాన్ ఇండియా వైడ్‌గా సంపాదించుకున్న యష్ నుంచి రాబోతున్న మరో హై ఓల్టేజ్ స్టైలిష్ యాక్షన్ సినిమా టాక్సిక్. లేడీ డైనమిక్ డైరెక్టర్ గీతూ మోహన్‌దాస్ దర్శకత్వం వహించాడు.

Toxic Trailer: కన్నడ సినిమా ఇండస్ట్రీ గురించి మాట్లాడాల్సి వస్తే ముందు యష్ గురించి చెప్పుకోవాల్సిందే. కేజీఎఫ్ సిరీస్‌తో కన్నడ సినిమా ఇండస్ట్రీనే శాసించాడు. ఆ రకంగా రాకింగ్ స్టార్ ఇమేజ్ ని పాన్ ఇండియా వైడ్‌గా సంపాదించుకున్న యష్ నుంచి రాబోతున్న మరో హై ఓల్టేజ్ స్టైలిష్ యాక్షన్ సినిమా టాక్సిక్. లేడీ డైనమిక్ డైరెక్టర్ గీతూ మోహన్‌దాస్ దర్శకత్వం వహించాడు.

టాక్సిక్ ట్రైలర్ చూస్తే ఇది, లేడీ డైరెక్టర్ తీసిన సినిమాలా అస్సలు అనిపించదు. అలాంటి, యాక్షన్ సీన్స్, రొమాన్స్, అడల్ట్ కంటెంట్ ఉన్నాయి. యష్ కి తగ్గ కథ ఇది అని ట్రైలర్ చూసిన ప్రతీ ఒక్కరూ ఒప్పుకోవాల్సిందే. 4 నిమిషాల 38 సెకన్ల నిడివితో రిలీజైన ఈ మూవీ ట్రైలర్ రక్తపాతం, సర్కస్ ఫీట్స్, మాఫియా సామ్రాజ్యం, అండర్ వరల్డ్, గ్యాంగ్‌స్టర్ డ్రామా..ఇలా పలు జానర్స్ తో నిండిపోయింది.

ఒక రకంగా ట్రైలర్‌లోనే యష్ విశ్వరూపం చూపించాడు. ఒక హాలీవుడ్ సినిమా థియేట్రికల్ ట్రైలర్ చూస్తున్న ఫీల్ కనిపించేలా గీతూ మోహన్‌దాస్ ట్రైలర్ ని కట్ చేశారు. లేడీ సూపర్ స్టార్ నయనతార, కియారా అద్వానీ, హుమా ఖురేషి, తారా సుతారియా పాత్రలు కేవలం గ్లామర్ కోసమే కాదని ట్రైలర్ చూస్తేనే అర్థమవుతోంది. ముఖ్యంగా నయన్, కియారా.. రాయకు మధ్య ఎమోషనల్ బాండింగ్ ని అద్భుతంగా చూపించారు.

ఇక కాంతార 1 ఫేమ్ రుక్మిణి ప్రభుత్వం తరుపున పనిచేసే అధికారిగా నటించింది. ఆమె ముందు యష్ న్యూడ్ గా నిలబడే సీన్ కి మైండ్ బ్లాక్ అవుతుంది. రాయ అనే బడా గ్యాంగ్‌స్టర్ జీవితంలో జరిగిన సంఘటనలు.. అతను పోరాడిన వ్యక్తులు అందరిని ఈ ట్రైలర్ లో చూపించి ఇంట్రెస్ట్ క్రియేట్ చేశారు. ట్రైలర్ లో చివరికి రాయ.. తన కన్న కొడుకుతోటే యుద్ధం చేయాల్సివస్తుంది. అలాంటి పరిస్థితి దేనికి వచ్చింది ? అసలు రాయ ఎవరూ ? వీటికి సమాధానం దొరకాలంటే సినిమా వచ్చే వరకూ ఆగాల్సిందే. కేవీఎన్ ప్రొడక్షన్స్ అత్యంత భారీ బడ్జెట్‌తో టాక్సిక్ చిత్రాన్ని పాన్ ఇండియా మూవీగా నిర్మించారు. ఆగస్టు 26న భారీ స్థాయిలో రిలీజ్ కాబోతోంది.

#yash#toxic#geethumohandass#nayanatara#kiaraadvani#humaqureshi#tarasutaria
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి
YouTubeలో చూడండి ↗

తర్వాత చదవండి