సినిమా

Irumudi Trailer Update: పోస్టర్ కి టైటిల్ కి సంబంధం లేదే?

రచన: Anshu4 నిమిషాల పఠనం

Irumudi Trailer Update: రవితేజ నటించిన లేటెస్ట్ సినిమా 'ఇరుముడి'. శివ నిర్వాణ దర్శకత్వం వహించాడు. ఈ సినిమా రిలీజ్ డేట్ దగ్గరపడుతున్న నేపథ్యంలో మేకర్స్ ప్రమోషన్స్‌లో జోరు పెంచారు. ఈ క్రమంలోనే వరుస అప్‌డేట్స్ అందిస్తున్నారు. లిరికల్ సాంగ్స్ తో పాటు పోస్టర్స్ కూడా వదులుతున్నారు. ఇప్పటి వరకూ రిలీజ్ చేసిన ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై బాగానే అంచనాలు పెంచింది.

Irumudi Trailer Update: రవితేజ నటించిన లేటెస్ట్ సినిమా 'ఇరుముడి'. శివ నిర్వాణ దర్శకత్వం వహించాడు. ఈ సినిమా రిలీజ్ డేట్ దగ్గరపడుతున్న నేపథ్యంలో మేకర్స్ ప్రమోషన్స్‌లో జోరు పెంచారు. ఈ క్రమంలోనే వరుస అప్‌డేట్స్ అందిస్తున్నారు. లిరికల్ సాంగ్స్ తో పాటు పోస్టర్స్ కూడా వదులుతున్నారు. ఇప్పటి వరకూ రిలీజ్ చేసిన ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై బాగానే అంచనాలు పెంచింది.

రెమ్యునరేషన్ లేకుండా రవితేజ?

ఇటీవల కాలంలో రవితేజకి ఆశించిన విజయం దక్కలేదు. ధమాకా తర్వాత మళ్ళీ ఆ స్థాయి హిట్ అందుకోవడంలో రవితేజ తడబడ్డాడు. దీంతో, మేకర్స్ అన్నీ విషయాలలో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అయితే, రవితేజ కూడా తన సినిమాల ఫలితాలను చూసి ఇప్పుడు చేస్తున్న ఇరుముడి సినిమాకి రెమ్యునరేషన్ తీసుకోలేదని తెలుస్తోంది. సినిమా గనక హిట్ సాధించి నిర్మాతకి లాభాలు వస్తే అందులో నుంచి తన రెమ్యునరేషన్ తీసుకోవాలనుకున్నాడట. ఒకరకంగా ఇది నిర్మాతకి అండగా నిలవడమే.

ట్రైలర్ కి డేట్ ఫిక్స్:

'ఇరుముడి' సినిమా థియేట్రికల్ రిలీజ్ కి రెడీ అవుతున్న నేపథ్యంలో తాజాగా మేకర్స్ ట్రైలర్ రిలీజ్ డేట్ ని ప్రకటించారు. దీనితో పాటు ఓ ఆసక్తికరమైన పోస్టర్‌ను వదిలారు. మైత్రీ వారు నిర్మిస్తున్న ఈ సినిమా ట్రైలర్ ఆగస్టు 12వ తేదీన భీమవరంలో భారీ ఈవెంట్ లో రిలీజ్ చేయబోతున్నారు. మాస్ మహారాజ్ కి రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు విదేశాలలోనూ ఫ్యాన్స్ ఉన్నారు.

ఇక, 'ఇరుముడి' సినిమా రిలీజ్ ఆగస్టు 21న లాకైంది. అయితే, తాజాగా ట్రైలర్ అనౌన్స్‌మెంట్ పోస్టర్ ఎంతో ఇంట్రెస్టింగ్‌గా ఉంది. ఒక వైపు పొడవాటి కత్తి నోట్లో పెట్టుకొని మాస్ అవతారంలో కనిపిస్తుంటే..మరోవైపు అయ్యప్ప మాలలో ఎంతో దైవభక్తిని కలిగి ఉన్నాడు. 'ఇరుముడి' టైటిల్ కి తగ్గట్టు ఒక లుక్ ఉన్నా..మరో మాస్ లుక్ మాత్రం ఫ్యాన్స్ కి షాకిస్తుంది. టైటిల్ కి ఈ పోస్టర్ లో లుక్ కి అసలు సంబంధం లేదు కదా..శివ నిర్వాణ ఎలా ప్లాన్ చేశాడు..అని ఎగ్జైట్‌మెంట్‌తో సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. కాగా, ఈ సినిమాలో హీరోయిన్‌గా ప్రియ భవానీ శంకర్ నటించింది. రవితేజ కూతురు పాత్రలో బేబీ నక్షత్ర కనిపించబోతోంది.

#Irumudi#Raviteja#ShivaNirvana#PriyaBhavaniShankar
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి