100 Horns Bike: ఉత్తరాఖండ్ లోని హరిద్వార్ లో వాహన తనిఖీల సమయంలో పోలీసులకు ఓ బైక్ కంటపడింది. ఆ బైక్ ను చూసి పోలీసులే పరేషాన్ అయ్యారు. ఇదెక్కడి విడ్డూరం అని ముక్కున వేలేసుకున్నారు. వారలా షాక్ అవడానికి కారణం ఆ బండికి 100 హారన్లు ఉండటమే. ఈ చిత్రవిచిత్రమైన బైక్ ను చూసి స్థానికలే కాదు పోలీసులు సైతం విస్తుపోయారు. రూల్స్ కు విరుద్ధంగా ఉందంటూ పోలీసులు యాక్షన్ తీసుకున్నారు. బైక్ ను సీజ్ చేసేశారు.
కన్వర్ యాత్ర సందర్భంగా పోలీసులు శంకరాచార్య చౌక్ వద్ద వాహన తనిఖీలు చేస్తున్నారు. ఆ సమయంలో ఈ 100 హారన్లు ఏర్పాటు చేసిన బైక్ పోలీసుల కంట పడింది. వెంటనే బైక్ ను సీజ్ చేశారు పోలీసులు. అంతేకాదు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించినందుకు బైక్ యజమానికి ఫైన్ కూడా వేశారు.
ఒకటి కాదు రెండు కాదు ఏకంగా వంద హారన్లను ఏర్పాటు చేయడం అందరినీ విస్తుపోయేలా చేస్తోంది. ఇది బైకా? హారన్ల షాపా? అని అంతా పరేషాన్ అవుతున్నారు. దీనిపై పోలీసులు సీరియస్ అయ్యారు. వెహికల్ మోడిఫికేషన్ రూల్స్ ను ఉల్లంఘించినందుకు బైక్ ను సీజ్ చేసి పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లినట్లు వివరించారు. కాగా, ఈ 100 హారన్ల మోడిఫైడ్ బైక్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
కాగా, ఇలాంటి పిచ్చి పనులు చేస్తే తాట తీస్తామని పోలీసులు హెచ్చరించారు. రూల్స్ ను బ్రేక్ చేస్తే మూల్యం చెల్లించక తప్పదన్నారు.
ఇక్కడ క్లిక్ చేసి వీడియో చూడండి..












