Ajay Bhupathi: ఒక దర్శకుడు సినిమా తీస్తున్నాడంటే, దాని ప్రభావం ఎంతోమంది మీద చూపుతుంది. కెప్టన్ ఆఫ్ ది షిప్ డైరెక్టరే. అందుకే, ఆ కుర్చీకి..అందులో కూర్చునే వ్యక్తికి అంత గౌరవమిస్తారు. నిర్మాత డబ్బులు పెట్టడం ఒక ఎత్తైతే, దాన్ని సరిగ్గా ఉపయోగించి అదే నిర్మాత మరో రెండు సినిమాలు తీయగల ధైర్యాన్నిచ్చే దర్శకుడు మరో ఎత్తు.
అయితే, ప్రతీ దర్శకుడు కథ రాసుకున్నప్పుడు హిట్ సినిమా తియ్యాలనే అనుకుంటాడు. అలాగే కష్టపడతాడు. కానీ, తెలియని లోపాల వల్ల సినిమా ఫలితం గనక తేడా వస్తే అందరికంటే ఎక్కువగా నష్టపోయేది నిర్మాత. అది, ఆర్ధికంగా మాత్రమే. కానీ, ఒక సినిమా ఫ్లాప్ ప్రభావం దర్శకుడి మీద..హీరోహీరోన్స్ మీద గట్టిగా చూపుతుంది. ఇలాంటి, పరిస్థితుల్లో దర్శకుడు ఆ ఫ్లాప్ ని అంగీకరించడం..ఎంతో గొప్ప విషయం.
అంతేకాదు, ఈ ఫ్లాప్ ప్రభావం మిగతావాళ్లపై ఎక్కువగా చూపదు. ఆర్ఎక్స్ 100 సినిమాతో సంచలన దర్శకుడిగా పేరు తెచ్చుకున్న అజయ్ భూపతి నుంచి ఇటీవల శ్రీనివాస మంగాపురం అనే సినిమా వచ్చింది. సూపర్ స్టార్ కృష్ణ మనవడు, బాలీవుడ్ సీనియర్ నటి రవీనా టాండన్ కూతురు రాషా తడానీ ఈ సినిమాతో అజయ్ టాలీవుడ్ కి పరిచయం చేశాడు. అయితే, పెద్దగా అంచనాలు లేకుండా వచ్చిన ఈ సినిమా ఫ్లాప్ సినిమాగా మిగిలింది.
కొన్ని కథలు ఎలాంటి హంగూ ఆర్భాటం లేకుండా వచ్చి, పెద్ద సక్సెస్‌ని సాధిస్తాయి. శ్రీనివాస మంగాపురం ఇలాంటి సక్సెస్ సాధించి ఉంటే ఈ రోజు, అజయ్ భూపతి ఇలాంటి స్టేట్‌మెంట్ ఇచ్చేవాడు కాదు. తాజాగా, ఆయన ఈ సినిమా పరాజయాన్ని ఒప్పుకుంటూ ఎక్స్ ద్వారా పోస్ట్ పెట్టాడు. ఈ సినిమాలో నటించిన వాళ్ళకి, పనిచేసిన టెక్నికల్ టీమ్ అందరికీ ధన్యవాదములు తెలిపాడు. అలాగే, మంచి హిట్ సినిమాతో మళ్ళీ మీ ముందుకు వస్తానని ట్వీట్‌లో రాసుకొచ్చాడు.
సినిమా ఫ్లాపైయ్యాక కొందరు..ఇతరులను నింధించడం, తప్పించుకోవడం చేస్తుంటారు. కానీ, అజయ్ భూపతి ఎంతో నిజాయితీగా ఎవరీనీ నింధించకుండా తానే బాధ్యత వహిస్తానని ఒప్పుకోవడం ఎంతో నిజాయితీ కలిగిన వ్యక్తిత్వాన్ని చూపించింది. ఇలా, ఒప్పుకున్నందుకు అందరూ అజయ్ ని మెచ్చుకుంటున్నారు. కాగా, అజయ్ చేసిన నాలుగు సినిమాలలో మహాసముద్రం, శ్రీనివాసమంగాపురం ఫ్లాపవగా..ఆర్ఎక్స్ 100, మంగళవారం హిట్స్ గా నిలిచాయి.












