The Paradaise: ఇటీవల వచ్చిన ది ప్యారడైజ్ సినిమా టీజర్ గురించి పాజిటివ్ రివ్యూస్ కంటే నెగిటివ్ రివ్యూస్ ఎక్కువగా వచ్చాయి. నెగిటివ్ కామెంట్స్ ఎక్కువ శాతం చేసిన వాళ్ళే ఉన్నారు. నాని హీరోగా నటిస్తున్న సినిమా ఇది. ఈపాటికే రిలీజ్ కావాల్సిన ది ప్యారడైజ్ పలు కారణాల వల్ల.. ఇదుగో వచ్చే నెల 24న రిలీజ్ అని ప్రకటించారు.
ఈ నేపథ్యంలో భారీ స్థాయిలో ప్రమోషన్స్ జరపాలని మేకర్స్ భావించారు. దీంతో, నాని పోస్టర్స్ రెండు వదిలారు. ఆ తర్వాత టీజర్ రిలీజ్ చేశారు. 'తగలబడుతుంది' అన్న మాట నిజమే అయినా..నాని డైలాగ్స్ ఆ మంటల్లో వినపడలేదని టీజర్ చూసిన వారు కామెంట్స్ చేశారు. ఎందుకంత స్పీడ్ డైలాగ్స్..వెనకాల ఆ బీజిఎం ఏంటీ..అసలు ఏమైనా అర్థం అవుతుందా..ఇన్ని రకాల కామెట్స్ వచ్చాయి.
దీంతో, కాస్త త్వరగానే దర్శకుడు శ్రీకాంత్ ఓదెల రియాక్ట్ అయ్యాడు. మళ్ళీ, టీజర్ ని కరెక్షన్స్ చేసి వదిలాడు. అయినా, జనాల మైండ్ లో పాత గాయమే ఉంటుంది. మార్చినా పెద్దగా ఉపయోగం లేకుండా పోయింది. అదేదో ముందే అన్నీ జాగ్రత్తలు తీసుకొని..ఒకటి పదిసార్లు చెక్ చేసుకొని ఉంటే ప్యారడైజ్ టీమ్ ఇలా ట్రోల్స్ కి నెగిటివ్ కామెంట్స్ కి గురైయ్యేవారు కాదు.
అంతా జరిగిపోయాక ఇప్పుడు నెత్తీ నోరూ బాదుకుంటే ఏమొస్తుంది..ఇప్పటికైనా మునిగిపోయింది..మించిపోయింది లేదు. ట్రైలర్ రిలీజ్ కావాల్సి ఉంది. సినిమా రిలీజ్ కి ఇంకా నెలకి పైగానే సమయం ఉంది. కాబట్టి..ఇకపై వదిలే ప్రమోషనల్ కంటెంట్ మీద దృష్టి పెట్టి జాగ్రత్తలు తీసుకుంటే నానికి, శ్రీకాంత్ ఓదెలకి మైల్ స్టోన్ మూవీ అయ్యే అవకాశాలుంటాయి. ఇక, ఇందులో హీరోయిన్‌గా కయాదు లోహర్ నటించింది. ఐటం సాంగ్‌లో కీర్తి సురేష్ చిందులు వేసింది. కలెక్షన్స్ కింగ్ మోనహన్ బాబు..బర్నింగ్ స్టార్ సంపూ కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు.












