National

PhonePe: యూపీఐ చెల్లింపులపై ఛార్జీలు..! ఫోన్‌పే యూజర్లకు గుడ్ న్యూస్

రచన: NK3 నిమిషాల పఠనం

కేంద్రం తెచ్చిన కొత్త పన్ను సవరణ బిల్లు లోక్ సభలో ఆమోదం పొందిన సంగతి తెలిసిందే. దీంతో యూపీఐ ద్వారా జరిగే లావాదేవీలపై ఛార్జీలు వసూలు చేస్తారన్న అంశంపై జోరుగా చర్చ జరుగుతోంది. ఛార్జీల బాదుడు తప్పదేమో అని యూపీఐ వినియోగదారులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఈ తరుణంలో PhonePe CEO సమీర్ నిగమ్ గుడ్ న్యూస్ చెప్పారు.

PhonePe: కేంద్రం తెచ్చిన కొత్త పన్ను సవరణ బిల్లు లోక్ సభలో ఆమోదం పొందిన సంగతి తెలిసిందే. దీంతో యూపీఐ ద్వారా జరిగే లావాదేవీలపై ఛార్జీలు వసూలు చేస్తారన్న అంశంపై జోరుగా చర్చ జరుగుతోంది. ఛార్జీల బాదుడు తప్పదేమో అని యూపీఐ వినియోగదారులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఈ తరుణంలో PhonePe CEO సమీర్ నిగమ్ గుడ్ న్యూస్ చెప్పారు. భారతీయ వినియోగదారులు అందరికీ UPI చెల్లింపులు ఉచితంగానే కొనసాగుతాయని సమీర్ నిగమ్ స్పష్టం చేశారు. UPI ద్వారా చెల్లింపులు చేసినందుకు వినియోగదారులపై ఎటువంటి అదనపు భారం పడదని, వారి నుంచి ఎలాంటి రుసుము వసూలు చేయము అని ఆయన హామీ ఇచ్చారు.

ఎక్స్ (ట్విట్టర్) వేదికగా సమీర్ నిగమ్ స్పందించారు. ''భారతీయ వినియోగదారులందరికీ UPI సేవలు ప్రస్తుతం ఉచితంగా ఉన్నాయి. ఇకపై కూడా అలాగే ఉచితంగా కొనసాగుతాయి" అని పేర్కొన్నారు. UPI చెల్లింపులు చేసినందుకు గాను వినియోగదారుల నుండి ఎటువంటి రుసుము వసూలు చేయమని వెల్లడించారు.

కొన్ని రకాల UPI లావాదేవీలపై ప్రతిపాదిత 'మర్చంట్ డిస్కౌంట్ రేట్' (MDR) గురించి చర్చ జరుగుతున్న నేపథ్యంలో PhonePe CEO నుండి ఈ వివరణ వచ్చింది. భవిష్యత్తులో UPI వినియోగానికి వినియోగదారుల నుండి ఛార్జీలు వసూలు చేస్తారేమోనన్న సందేహాలు ఈ ప్రతిపాదన కారణంగా తలెత్తాయి.

#PhonePe#UPI#UPI Payments#Free#Merchant Discount Rate#UPI Transactions#Sameer Nigam#Swechaa News
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి