తెలంగాణ

HYDRAA JOBS: ‘హైడ్రా’ డ్రైవర్ జాబ్స్‌కు పోటెత్తిన నిరుద్యోగులు.. స్టేడియం వద్ద తోపులాట!

రచన: Mamatha puppala5 నిమిషాల పఠనం

ఒక ఉద్యోగం పడితే చాలు.. వేల మంది గుమిగూడే పరిస్థితి.. రూపాయి సంపాదన లేక, ఇంట్లో అడిగలేక.. రోజులు గడిచే కొద్దీ పెరిగిపోతున్న వయసును చూసి నలిగిపోతున్న నిరుద్యోగుల ఆవేదనకు సరూర్‌నగర్ స్టేడియం దృశ్యాలే ప్రత్యక్ష సాక్ష్యం. కేవలం 150 'హైడ్రా' ఉద్యోగాల కోసం వేలాది మంది యువకులు అర్ధరాత్రి నుంచే స్టేడియం ముందు క్యూ కట్టారంటే.. మన దగ్గర నిరుద్యోగం ఏ స్థాయిలో ఉందో, ఒక చిన్న ఉద్యోగం కోసం కుర్రాళ్లు ఎంతగా తపిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు.

హైదరాబాద్ నగరంలో విపత్తు నిర్వహణ, సహాయక చర్యల కోసం ఏర్పాటైన ‘హైడ్రా’ (HYDRAA) సంస్థ చేపట్టిన డ్రైవర్ ఉద్యోగ నియామక ప్రక్రియ వద్ద తీవ్ర గందరగోళం నెలకొంది. ఎల్‌బీ నగర్ సమీపంలోని సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియం ప్రాంగణంలో శనివారం వేకువజాము నుంచే ఉద్రిక్త వాతావరణం కనిపించింది. సంస్థ ప్రకటించిన పరిమిత పోస్టుల కోసం ఊహించని రీతిలో వేలాది మంది అభ్యర్థులు ఒకేసారి తరలిరావడంతో గేట్ల వద్ద తీవ్ర తోపులాట చోటుచేసుకుంది. హైడ్రా పరిధిలోని డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్(DRF) విభాగంలో 100 అసిస్టెంట్ పోస్టులు, అలాగే 50 హెవీ వెహికల్ డ్రైవర్ పోస్టులతో కలిపి మొత్తం 150ఖాళీల భర్తీకి అధికారులు ప్రకటన విడుదల చేశారు.

ఈ నియామకాల్లో భాగంగా ఆగస్టు 8, 9 తేదీల్లో ఉదయం 5 గంటల నుంచే సరూర్‌నగర్ స్టేడియంలో దేహదారుఢ్య పరీక్షలు (ఫిజికల్ ఈవెంట్స్) ఉంటాయని వెల్లడించడంతో రాష్ట్రంలోని పలు జిల్లాల నుంచి అభ్యర్థులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఈ ఎంపిక ప్రక్రియలో క్వాలిఫై కావడానికి అధికారులు కఠినమైన నిబంధనలను విధించారు. అభ్యర్థులు 800 మీటర్ల పరుగును 170 సెకన్లలో, 100 మీటర్ల స్ప్రింట్‌ను 15 సెకన్లలో పూర్తి చేయాల్సి ఉంది.

వీటితో పాటు 4 మీటర్ల లాంగ్ జంప్ సాధించడంతో పాటు 7.2 కేజీల షాట్‌పుట్‌ను 6 మీటర్ల దూరం విసిరితేనే తదుపరి దశకు అర్హత లభిస్తుందని స్పష్టం చేశారు. అయితే, ఖాళీలు తక్కువగా ఉన్నప్పటికీ రికార్డు స్థాయిలో నిరుద్యోగులు పోటీపడటంతో స్టేడియం ప్రవేశ ద్వారం వద్ద పరిస్థితి అదుపు తప్పింది. లోపలికి వెళ్లేందుకు అభ్యర్థులు ఒకరినొకరు నెట్టుకోవడంతో తీవ్ర అస్తవ్యస్త వాతావరణం ఏర్పడగా, అధికారులు ఎంతో శ్రమించి పరిస్థితిని చక్కదిద్దాల్సి వచ్చింది. అధికారుల వైపు నుంచి సరైన ముందస్తు ఏర్పాట్లు, స్పష్టమైన మార్గదర్శకాలు లేకపోవడం వల్లే ఈ తోపులాట జరిగిందని అభ్యర్థులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.

#HydraaJobs#SaroornagarStadium#TelanganaJobs#HydNews#TelanganaUnemployment#HydraaEvents#Swechaanews
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి