సినిమా

Korean kanakaraju: సక్సెస్ ట్రాక్ ఎక్కిన వరుణ్ తేజ్..

రచన: Anshu4 నిమిషాల పఠనం

Korean kanakaraju: చాలాకాలంగా హిట్స్ లేక ఇబ్బంది పడుతున్న మన హీరోలు ఒక్కొక్కరు మెల్లగా మంచి హిట్ కొట్టి మళ్ళీ సక్సెస్ ట్రాక్ ఎక్కుతున్నారు. మొన్నామధ్య అఖిల్ లెనిన్ సినిమాతో వచ్చి హిట్ కొట్టాడు. ఎవరూ ఊహించని విధంగా ఇది 100 కోట్ల మార్క్ ను చేరుకుంది. అఖిల్ ఇలాంటి సక్సెస్ కోసం ఎన్నో ఏళ్ళ నుంచి ఎదురుచూశాడు. ఇక, కెరీర్‌లో హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సేకి మంచి హిట్ లెనిన్ రూపంలోనే దక్కింది.

సమంత కూడా బంగారం లాంటి హిట్ కొట్టింది..

మజిలీ తర్వాత సమంత నటించిన సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద బోల్తా పడ్డాయి. శాకుంతలం, యశోద ఆమె కెరీర్ ని బాగా డిస్ట్రబ్ చేసిన సినిమాలు. మళ్ళీ, ఇటీవల సమంత మంచి కంబ్యాక్ ఇచ్చింది. మా ఇంటి బంగారం సినిమాతో వచ్చి 100 కోట్ల క్లబ్‌లో చేరింది. ఇక, సమంత సినిమాలను ఎవరూ చూడరని అందరూ అనుకున్నారు. ప్రచారం కూడా అలాగే, జరిగింది. వాటన్నిటికీ సమంత చెంప పెట్టు సమాధానమిచ్చింది.

ఇప్పుడు, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కూడా కొరియన్ కనరాజు సినిమాతో వచ్చి మంచి హిట్ అందుకున్నాడు. ఇలాంటి కథలను చేయాలనుకోవడం పెద్ద సాహసం. అందులోనూ ఫ్లాప్స్ లో ఉన్న హీరో ఇలాంటి జానర్ సినిమా చేయాలంటే ఆలోచిస్తాడు. కానీ, వరుణ్ తేజ్ మాత్రం కథ మీద నమ్మకంతో కొరియన్ కనకరాజు సినిమాను ఎంచుకున్నాడు.

దర్శకుడు మేర్లపాక గాంధీ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా మొదటి రోజు కలెక్షన్స్ చూస్తే షాకవ్వాల్సిందే. 10 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టినట్టుగా తెలుస్తోంది. వీకెండ్ కావడంతో బుకింగ్స్ కూడా మంచి జోరు మీదున్నాయి. అన్నీ వర్గాల ప్రేక్షకులు చూసేలా కొరియన్ కనరాజు ఉంది. దీంతో, మూడు రోజులు సెలవులు కూడా బాగా కలిసి వచ్చాయి. గ్యారెంటీగా డీసెంట్ కలెక్షన్స్ రాబడుతుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మొత్తానికి, వరుణ్ తేజ్ కూడా హిట్ కొట్టి సక్సెస్ ట్రాక్ ఎక్కాడు.

#KoreanKanakaraju#VarunTej#Ritikanayak#MerlapakaGandhi
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి