తెలంగాణ

Bandi : టెన్షన్ టెన్షన్.. పాతబస్తీకి బండి సంజయ్

రచన: Kumar3 నిమిషాల పఠనం

కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్ నేడు పాతబస్తీకి వెళ్లనున్నారు. బోనాల సందర్భంగా ఆయన అక్కడకు వెళ్లనున్నారు. బండి సంజయ్ వస్తున్నారని తెలియడంతో పెద్దఎత్తున అక్కడ బందోబస్తు, ఏర్పాట్లు చేసినట్టు తెలుస్తోంది.

కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్ నేడు పాతబస్తీకి వెళ్లనున్నారు. బోనాల సందర్భంగా ఆయన అక్కడకు వెళ్లనున్నారు. బండి సంజయ్ వస్తున్నారని తెలియడంతో పెద్దఎత్తున అక్కడ బందోబస్తు, ఏర్పాట్లు చేసినట్టు తెలుస్తోంది. బోనాల సమయం కావడంతో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటుచేశారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి పరిస్థితిని సమీక్షించనున్నారని తెలుస్తోంది.

బీజేపీ శ్రేణులు, మరికొందరు కీలక నేతలు సైతం ఆయన వెంట పాతబస్తీకి వెళ్లి బోనాల ఉత్సవాల్లో పాల్గొంటారని సమాచారం. అయితే, కేంద్రమంత్రి వస్తున్న నేపథ్యంలో సెన్సిటిల్ ఏరియా అయిన పాతబస్తీలో ఎటువంటి ఘర్షణలు చోటుచేసుకోకుండా పోలీసులు నిఘా మరింత పెంచారు. ట్రాఫిక్ డైవర్షన్స్ ఏర్పాటు చేశారు.ఇదిలాఉండగా, బండి సంజయ్ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పాతబస్తీలో పర్యటిస్తారని తెలిసింది.

అక్కడ పలు దేవాలయాలను ఆయన సందర్శించనున్నారు. ఉదయం 10.30 గంటలకు సైదాబాద్ కుర్మగూడలోని మూడు ఆలయాల్లో అమ్మవార్లను దర్శించుకోనున్నారు. అక్కడి నుండి కుర్మగూడ పూలతోట ఒంటి జడల మైసమ్మ గుడికి వెళ్లనున్నారు.ఆ తర్వాత మాదన్నపేట నల్ల పోచమ్మ టెంపుల్, అరుంధతి కాలనీ బంగారు మైసమ్మ టెంపుల్, ముక్కెర బస్తీ నల్ల పోచమ్మ టెంపుల్, ఉప్పుగూడ మహంకాళి టెంపుల్, గౌలిపురలోని భారత మాత టెంపుల్, అక్కన్న మాదన్న టెంపుల్‌ను కూడా దర్శించుకోనున్నారు.

మధ్యాహ్నాం ఒంటి గంటకు లాల్ దర్వాజ సింహవాహిని మహంకాళి అమ్మవారిని దర్శించుకుంటారు. అక్కడ బండి సంజయ్ ప్రసంగిస్తారని తెలిసింది. మధ్యాహ్నం 1.45 గంటలకు అలియాబాద్ నల్ల పోచమ్మ గుడి, గుడిమల్కాపూర్ సబ్జి మండలి గుడి, కార్వాన్ ఆలయాన్ని దర్శించుకోనున్నారు. ఆయన వెంట భారీగా బీజేపీ శ్రేణులు తరలనున్నట్టు తెలుస్తోంది. కాగా, బండి పర్యటన వేళ పాతబస్తీలో టెన్షన్ వాతావరణం నెలకొంది.

#bandi sanjay#old city#bonalu fest#hyderabad#politics
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి