సినిమా

Actor Ali: నాకు అన్నం పెట్టింది సినిమా! వాళ్ళు నన్ను కరివేపాకులా తీసేశారు!

రచన: Anshu4 నిమిషాల పఠనం

Actor Ali : సీనియర్ నటుడు, కమెడియన్, టీవీ హోస్ట్ అలీ వైసీపీ మీద చేసిన సంచలన వ్యాఖ్యలు నెట్టింట ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. అలి సినిమా ఇండస్ట్రీలోకి వచ్చి 45 ఏళ్ళు అవుతోంది. 1981 లో వచ్చిన సీతాకోకచిలుక సినిమాతో ఫిల్మ్ ఇండస్ట్రీలోకి వచ్చాడు. 1100 కి పైగా చిత్రాల్లో నటించాడు. హీరోగా యమలీలతో ఎంతో పాపులర్ అయ్యాడు.

Actor Ali : సీనియర్ నటుడు, కమెడియన్, టీవీ హోస్ట్ అలీ వైసీపీ మీద చేసిన సంచలన వ్యాఖ్యలు నెట్టింట ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. అలి సినిమా ఇండస్ట్రీలోకి వచ్చి 45 ఏళ్ళు అవుతోంది. 1981 లో వచ్చిన సీతాకోకచిలుక సినిమాతో ఫిల్మ్ ఇండస్ట్రీలోకి వచ్చాడు. 1100 కి పైగా చిత్రాల్లో నటించాడు. హీరోగా యమలీలతో ఎంతో పాపులర్ అయ్యాడు.

మన స్టార్ హీరోలందరి సినిమాలలో నటించిన క్రెడిట్ అలీది. పవన్ కళ్యాణ్ అంటే ఎక్కువ ఇష్టం. అయితే 2019లో వైసీపీలో చేరాడు ఆలీ. ఆ సమయంలో ఆయనకు ఎలక్ట్రానిక్ మీడియా అడ్వైజర్‌ గా పదవినిచ్చింది వైసీపీ. కానీ, ఆలీ చేసిన సేవకు ఎలాంటి గుర్తింపు దక్కలేదు. దీంతో ఆయన 2024లో పార్టీ వదిలి బయటకు వచ్చేశాడు.

ఇన్నాళ్ళకి పార్టీని వదిలేయడానికి అసలు కారణాలు చెబుతున్న ఒక లేటెస్ట్ వీడియో గత రెండు రోజులుగా సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతూ వైరల్ అవుతోంది. ఈ నేపథ్యంలో ఆయన తాజాగా ఓ ఇంటర్వ్యూ ఇచ్చాడు. దీనిలో, ‘నేను రాజకీయాల్లోకి రావాలనుకోలేదు. అనుకోని పరిస్థితుల్లో వెళ్ళాల్సి వచ్చింది. పార్టీ నుంచి ఏమీ అశించకుండా వెళ్లాను. నిజంగానే నేను ఏదో ఆశించి వెళితే ఒకటి, రెండేళ్లల్లో బయటకు వచ్చేసేవాడిని.

నా సినిమాలు మానుకుని మరీ వెళ్లి ఎన్నికల సమయంలో వైసీపీ పార్టీకి ఎంత ప్రచారం చేశానో ప్రజలందరికీ తెలుసు. కానీ, నాకు అక్కడ ఏ గుర్తింపు దక్కలేదు. ఇలా, ఐదేళ్లకోసారి వాడుకుని వదిలేస్తే ఎవరికైనా ఎలా ఉంటుంది? బాధ అనిపిస్తుందా లేదా? నాకు అన్నం పెట్టింది సినిమానే.. రాజకీయం, ఏ రాజకీయ నాయకుడు కాదు. సినిమాలతో పాటు, బయట కూడా నాకు మంచి గుర్తింపే ఉంది. ఇంత పేరున్న నన్ను వైసీపీ వాడుకుని, గుర్తింపు లేకుండా కరివేపాకులా తీసి పారేసింది.

అందుకే నాకు బాధ కలిగింది. ఆ బాధలను అనుభవించాను కాబట్టే నాకెందుకు ఈ రాజకీయం అనుకొని...నా పని నాకుంది బయటకు రావాలనిపించింది. దాంతో నాకు ఈ రాజకీయాలు వద్దు అని నిర్ణయించుకుని బయటకు వచ్చేశా. అందుకే మళ్లీ నా పని నేను చేసుకుంటున్నా’ అని అన్నాడు అలీ. ఒక్క అలీ మాత్రమే కాదు, గతంలో చాలామంది ఇలాంటి బాధలు పడి వైసీపీపై కోపంతో బయటకు వచ్చారు.

#ali#ycp#actor ali#cinema
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి