National

West Bengal: బెంగాల్ పేరు మారుతోంది.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి సంచలన ప్రకటన!

రచన: Mahesh••4 నిమిషాల పఠనం

West Bengal: పశ్చిమ బెంగాల్ రాష్ట్ర పేరు మార్పుపై ఆ రాష్ట్ర స్టేట్ బీజేపీ చీఫ్ సమిక్ భట్టాచార్య సంచలన కామెంట్స్ చేశారు. రాష్ట్ర చారిత్రక వారసత్వం, గుర్తింపును ప్రతిబింబించేలా ‘పశ్చిమ బెంగాల్’ పేరును ‘పశ్చిమ బంగా’గా మార్చాలని నిర్ణయించినట్లు ఆయన వెల్లడించారు.

West Bengal: పశ్చిమ బెంగాల్ రాష్ట్ర పేరు మార్పుపై ఆ రాష్ట్ర స్టేట్ బీజేపీ చీఫ్ సమిక్ భట్టాచార్య సంచలన కామెంట్స్ చేశారు. రాష్ట్ర చారిత్రక వారసత్వం, గుర్తింపును ప్రతిబింబించేలా ‘పశ్చిమ బెంగాల్’ పేరును ‘పశ్చిమ బంగా’గా మార్చాలని నిర్ణయించినట్లు ఆయన వెల్లడించారు. బుధవారం మీడియాతో మాట్లాడిన ఆయన.. "ఇంకెన్ని సార్లు స్పష్టత ఇవ్వాలి? రాష్ట్ర పేరు ఇకపై 'పశ్చిమ బంగా'గానే ఉంటుంది. అసెంబ్లీలో త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక బిల్లును ప్రవేశపెడతాం" అని ఆయన స్పష్టం చేశారు.

‘బంగ్లా’, ‘పశ్చిమ బంగ్లా’ పదాలకు చెక్..

రాష్ట్ర పేరు మార్పు ప్రక్రియ త్వరలోనే స్టార్ట్ కానుందని తెలిపిన సమిక్ భట్టాచార్య.. ఇకపై ‘పశ్చిమ బంగ్లా’, ‘బంగ్లా’, ‘బంగా’ వంటి అయోమయ పేర్లను యూజ్ చేయాల్సిన పని ఉండదని తేల్చిచెప్పారు. "వెస్ట్ బెంగాల్‌లోని 'పశ్చిమ' అనే పదంతో పాటు మన చారిత్రక మూలాలను కలిపి ‘పశ్చిమ బంగా’గా మార్చుతున్నాం అని చెప్పారు. మా ప్రభుత్వం కొలువుదీరిన తొలి అసెంబ్లీ సమావేశాల్లోనే ఈ బిల్లును తీసుకొస్తాం. రాష్ట్ర చరిత్రతో పేగుబంధం ఉన్న ఈ పేరే బెంగాల్ అసలైన గుర్తింపుగా నిలుస్తుంది" అని పేర్కొన్నారు.

ప్రభుత్వాధినేతగా (సీఎంగా, పీఎంగా) ప్రధాని నరేంద్ర మోదీ 25 ఏళ్ల పాలనా ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా చేసిన ప్రసంగాన్ని ఆయన ప్రశంసించారు. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని పరిపాలనా జిల్లాల్లో బీజేపీ శ్రేణులు, అధికారులు మోడీ ప్రసంగాన్ని ఆసక్తిగా విన్నారని తెలిపారు. స్వామి వివేకానంద, మహర్షి అరబిందో వంటి మహనీయుల ఆశయాలను స్మరిస్తూ, పాతికేళ్ల తర్వాత కూడా తన జీవితాన్ని దేశానికే అంకితం చేశానని ప్రధాని చెప్పిన మాటలు యువతకు, ప్రజలకు గొప్ప స్ఫూర్తినిస్తాయని కొనియాడారు.

రాహుల్ గాంధీ చిన్న పిల్లాడు కాదు

మోడీ ప్రజాదరణను చూసి ప్రతిపక్షాలు, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ భయపడుతున్నారా అన్న ప్రశ్నకు సమిక్ భట్టాచార్య ఘాటుగా స్పందించారు. "రాహుల్ గాంధీ భయపడుతున్నారో లేదో ఆయన్నే అడగండి. మేం ఎవరినీ బెదిరించలేదు. ఆయన దెయ్యాలకు భయపడటానికి చిన్న పిల్లాడేమీ కాదు" అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. విపక్షాల వద్ద ప్రజా సమస్యలపై పోరాడేందుకు అసలు ఎజెండానే లేదని, లేని అంశాలను పెద్దవిగా చూపిస్తూ ఎక్కువ కాలం రాజకీయం చేయలేరని విమర్శించారు. రాబోయే రెండు దశాబ్దాల పాటు కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ ప్రభుత్వ మార్పు ఉండదనే భావన యువతలో స్పష్టంగా కనిపిస్తోందని అన్నారు.

#West Bengal#Paschim Banga#West Bengal Name Change#Paschim Banga Name Change#swechaa news
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి