సినిమా

Bommarillu Bhaskar: "బొమ్మరిల్లు" లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత జీతానికి పనిచేసిన భాస్కర్!

రచన: Anshu••4 నిమిషాల పఠనం

Bommarillu Bhaskar: 'బొమ్మరిల్లు' లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత ఏ దర్శకుడైనా ఇండస్ట్రీలో వరుసగా క్రేజీ ఆఫర్స్ అందుకుంటారు. అలాగే, భాస్కర్ కూడా మంచి ఆఫర్స్ అందుకున్నాడు. కానీ, 'బొమ్మరిల్లు' లాంటి సాలీడ్ హిట్ మాత్రం అందుకోలేకపోయాడు. దిల్ రాజు నిర్మాతగా భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన 'బొమ్మరిల్లు' అందరి కెరీర్‌లో మైల్ స్టోన్ మూవీ. నిర్మాతగా దిల్ రాజుకి విపరీతమైన లాభాలను తెచ్చిన సినిమా ఇది.

ఇక, హీరోగా సిద్ధార్థ్ టాలీవుడ్‌లో పాతుకుపోవాల్సిన సినిమా. హీరోయిన్‌గా జెనీలియా మాత్రం బాగానే ఆఫర్స్ అందుకుంది. ఎటు తిరిగి ఎక్కువ కాలం ఇండస్ట్రీలో నిలవలేకపోయింది మాత్రం దర్శకుడు భాస్కర్ మాత్రమే. 'బొమ్మరిల్లు', 'పరుగు' సినిమాల తర్వాత భాస్కర్ పేరు ఇండస్ట్రీలో మార్మోగిపోయింది. రెండవ సినిమానే అల్లు అర్జున్‌తో మూడవ సినిమాను మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌లతో చేసే ఛాన్స్.

అయితే, 'పరుగు' మాత్రమే యావరేజ్ టాక్‌తో సరిపెట్టుకుంది. కథ-కథనాలు బావున్నా..కాస్టింగ్ ఫెల్యువర్ గా నిలిచింది. ఆ తర్వాత చేసిన 'ఆరెంజ్' సినిమాతో ఏకంగా నాగబాబు నిర్మాణ రంగం నుంచే తప్పుకున్నాడు. ఆ రేంజ్‌లో 'ఆరెంజ్' సినిమా నష్టాలను మిగిల్చింది. ఇక, భాస్కర్ పరిస్థితైతే చెప్పనవసరం లేదు. ఆతర్వాత వచ్చిన 'ఒంగోలు గిత్త' సినిమాతో జీతానికి పనిచేయాల్సి వచ్చింది.

దర్శకుడిగా ఫ్లాప్స్ చూసిన భాస్కర్ కి గీతా ఆర్ట్స్ అండగా నిలిచింది. నెలవారి జీతంతో 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్' సినిమా ఛాన్స్ ఇచ్చింది. ఈ సినిమా జరిగినన్ని రోజులు భాస్కర్ కి నెలకి 2 లక్షల చొప్పున జీతం మాత్రమే ఇచ్చారట. ఒక దర్శకుడు ఘోర ప్రాజయాన్ని చూస్తే ఎలాంటి పరిస్థితులు వస్తాయో చెప్పడానికి భాస్కర్ ఉదాహరణ. ఇక, ఈ సినిమా తర్వాత భాస్కర్ కాస్త రిలీఫ్ అయ్యాడు. అఖిల్-పూజా హెగ్డే జంటగా నటించిన 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్' హిట్ టాక్ తెచ్చుకుంది. కానీ, ఆ తర్వాత చేసిన 'జాక్' మాత్రం ఫ్లాప్ సినిమాల లిస్ట్‌లో చేరింది.

#Bommarillu Bhaskar#Parugu#Orange#Most Eligible Bachelor
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి