Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో కాకా సినిమాను చేస్తోన్న సంగతి తెలిసిందే. విశ్వంభర సినిమా పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్‌ను జరుపుకుంటోంది. అయితే, ఈ సినిమాల తర్వాత వాస్తవానికి యువ దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తో సినిమా చేయాల్సింది. ఆ సినిమాను అధికారికంగా కూడా ప్రకటించారు. కానీ, ఇటీవల వచ్చిన ది ప్యారడైజ్ సినిమా ఫలితంతో చిరు..ప్రస్తుతానికి శ్రీకాంత్ ఓదెల ప్రాజెక్ట్‌ను హోల్డ్‌లో పెట్టారట. ఆ ప్లేస్‌లో మరో ఇద్దరు డైరెక్టర్స్ రానున్నట్టు తాజా సమాచారం.
కార్తీక్ సుబ్బరాజ్‌కి చిరు గ్రీన్ సిగ్నల్?
కోలీవుడ్ క్రేజీ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి సినిమా చేయబోతున్నారనే వార్తలు ఇప్పుడు ఫిలింనగర్ లో ఊపందుకున్నాయి. ఇటీవలే, కార్తీక్ సుబ్బరాజ్ మెగాస్టార్‌ను కలిసి కథ వినిపించినట్లుగా తెలుస్తోంది. అయితే, ఈ మూవీపై చిరంజీవి నుంచి ఇంకా కన్‌ఫర్మేషన్ రాలేదట. భిన్నమైన కథలు, డిఫరెంట్ స్క్రీన్‌ప్లేతో సినిమాలను రూపొందించడంలో కార్తీక్ సుబ్బరాజ్ సాధ్యుడు. ‘పిజ్జా’, ‘జిగర్తండా’, ‘పేట్ట’, ‘జగమే తందిరమ్’, ‘జిగర్తండా డబుల్ ఎక్స్’ వంటి సినిమాలతో కోలీవుడ్‌లో బాగా పాపులర్ అయ్యాడు. ఇటీవల కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో వచ్చిన డోరొతీ మంచి విజయాన్ని అందుకుంది.
ఈ క్రమంలోనే మెగాస్టార్ మాస్ ఇమేజ్‌కి తగ్గట్టుగా పవర్ ఫుల్ యాక్షన్ డ్రామా కథను రెడీ చేసి చిరుకు వినిపించాడట. ఇంకా, ఆయన ఏ నిర్ణయం చెప్పనట్టుగా తెలుస్తోంది. త్వరలో, ఈ కాంబో మూవీపై ఓ క్లారిటీ రానుంది. ఇదిలా ఉంటే, మెగాస్టార్ కోసం మరో టాలెంటెడ్ డైరెక్టర్ కథ సిద్ధం చేసే పనిలో ఉన్నాడట. ఆ దర్శకుడెవరో కాదు..సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సానా.
మైత్రీ-చిరు-బుచ్చిబాబు కాంబో!
అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ బుచ్చిబాబు తో చిరంజీవి కోసం ఓ కథను రెడీ చేయిస్తున్నారట. అది, గనక ఆయనకి నచ్చితే నెక్స్ట్ చిరును డైరెక్ట్ చేసే లక్కీ ఛాన్స్ బుచ్చిబాబుకే దక్కుతుంది. ఉప్పెన మూవీతో ఇండస్ట్రీ హిట్ ఇచ్చిన బుచ్చిబాబు..ఇటీవల మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌తో పెద్ది చిత్రాన్ని తీసి విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. అప్పుడే, చిరుతో సినిమా చేయాలనే కోరికను బయటపెట్టాడు బుచ్చిబాబు. అది, ఇంత త్వరగా ఆచరణలోకి వస్తుందనుకోలేదు. మొత్తానికి, ఒక దర్శకుడు గ్యాప్ ఇస్తే ఇద్దరిని ముందుకు లాగాడు చిరు. చూడాలి, మరి వీరిలో ఫైనల్‌గా చిరుకు యాక్షన్..కట్ చెప్పేదెవరో.


