తెలంగాణ

బీజేపీ, కాంగ్రెస్ లో మహిళలకు రక్షణ లేదు : ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్

రచన: Mahesh•••7 నిమిషాల పఠనం

TG: రాష్ట్రంలో మహిళల మానప్రాణాలకు రక్షణ లేకుండా పోయిందని, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు వేధింపుల సంస్కృతిని ప్రోత్సహిస్తున్నాయని బీఆర్‌ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ తీవ్రస్థాయిలో విరుచుపడ్డారు. బీజేపీ యువమోర్చా జాతీయ కోశాధికారి టి.ఎం.సాయిప్రసాద్‌పై బీజేపీ ఎస్సీ మోర్చా నాయకురాలు డి.పద్మిని చేసిన లైంగిక, కుల వివక్ష వేధింపుల ఉదంతం రాజకీయ వర్గాల్లో పెను దుమారం రేపుతోంది.

TG: రాష్ట్రంలో మహిళల మానప్రాణాలకు రక్షణ లేకుండా పోయిందని, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు వేధింపుల సంస్కృతిని ప్రోత్సహిస్తున్నాయని బీఆర్‌ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ తీవ్రస్థాయిలో విరుచుపడ్డారు. బీజేపీ యువమోర్చా జాతీయ కోశాధికారి టి.ఎం.సాయిప్రసాద్‌పై బీజేపీ ఎస్సీ మోర్చా నాయకురాలు డి.పద్మిని చేసిన లైంగిక, కుల వివక్ష వేధింపుల ఉదంతం రాజకీయ వర్గాల్లో పెను దుమారం రేపుతోంది. కేంద్ర, రాష్ట్ర పాలకుల అండదండలతోనే ఈ దారుణాలు సాగుతున్నాయని ఆధారాలతో సహా ప్రవీణ్ కుమార్ నిప్పులు చెరిగారు.

30 పేజీల ఫిర్యాదు ఇస్తే.. నీరుగార్చేలా బలహీన సెక్షన్లా?

మల్కాజిగిరి పరిధిలోని అల్వాల్ పోలీస్ స్టేషన్‌లో అక్టోబర్ 5న బాధితురాలు ఇచ్చిన కంప్లైంట్‌పై సాధారణ సెక్షన్లతో ఎఫ్‌ఐఆర్ ఫైల్ చేయడం వెనుక కుట్ర దాగి ఉందని ప్రవీణ్ కుమార్ మండిపడ్డారు. తెలంగాణలో పోలీస్ మాన్యువల్ కాకుండా ‘రేవంత్ మాన్యువల్’ నడుస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధితురాలు 30 పేజీల సమగ్ర ఆధారాలతో ఫిర్యాదు సమర్పిస్తే, నిందితుడిని రక్షించేలా కేసును పలుచన చేశారని ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇవ్వకపోతే రాష్ట్రంలో చార్జ్‌షీట్లు పడవు, నిందితులను అరెస్ట్ చేయరని మండిపడ్డారు.

పదవుల ఆశచూపి బెంబేలెత్తించిన కామాంధుడు

బీఎస్సీ కంప్యూటర్స్ చదువుకుని రాజకీయాల్లో ఎదగాలని వచ్చిన దళిత మహిళను బీజేపీ కార్యాలయం, ప్రైవేటు నివాసాల వేదికగా అడుగడుగునా వేధించారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. 2024 డిసెంబర్ 24, 2025 ఏప్రిల్ 1, ఆగస్టు 9 తేదీల్లో బెడ్‌రూమ్‌కు రావాలంటూ సాయిప్రసాద్ అసభ్యంగా ప్రవర్తించాడని బాధితురాలు వాపోయినట్లు తెలిపారు. పదవులు, పోస్టింగుల పేరుతో వెట్టిచాకిరీ చేయించుకుని, తీరా ఎదురుతిరిగితే కులం పేరుతో బూతులు తిడుతూ అవమానించారని పేర్కొన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ వాడి ఫేక్ అశ్లీల ఫోటోలు సృష్టించి సోషల్ మీడియాలో పెడతానని, 15 ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్స్ ద్వారా బెదిరింపులకు పాల్పడ్డారని వెల్లడించారు. పాక శివ, జాన్, ఆదిత్య వంటి వ్యక్తులతో కూడా కలిసి రాత్రివేళల్లో కాల్స్ చేస్తూ చిత్రహింసలకు గురిచేశారని ధ్వజమెత్తారు. 14 క్రిమినల్ కేసులు ఉన్న వ్యక్తికి ఏ ప్రాతిపదికన బీజేపీ జాతీయ స్థాయి పోస్టు కట్టబెట్టిందని నిలదీశారు.

అమిత్ షా నుంచి రేవంత్ దాకా.. అంతా ఒక్కటేనా?

ఈ అరాచకాల వెనుక పెద్ద ఎత్తున పొలిటికల్ నెట్‌వర్క్ పనిచేస్తోందని ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ఎంపీ తేజస్వి సూర్యతో సంబంధాలు ఉన్నాయనే ధీమాతో సాయిప్రసాద్ విర్రవీగుతున్నాడని పేర్కొన్నారు. అటు సీఎం రేవంత్ రెడ్డి సర్కారు కూడా ఈ వ్యవహారంలో జోక్యం చేసుకుని పోలీసులపై ఒత్తిడి తెచ్చిందని, కీలక వ్యక్తులు ఫోన్లు చేసి కేసును సాధారణ సెక్షన్లకే పరిమితం చేయించారని ఆరోపించారు. మీడియాలో వచ్చిన వార్తలను కూడా బెదిరించి తొలగించే స్థాయికి వ్యవహారం వెళ్లిందని నిప్పులు చెరిగారు. నిందితుడికి అధికార వర్గాల్లో ఉన్న పలుకుబడి దృష్ట్యా ఈ కేసును సాధారణ పోలీసులు సరిగ్గా దర్యాప్తు చేయలేరని, హైకోర్టు లేదా సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జి పర్యవేక్షణలో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్) ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. డీజీపీ, ఉమెన్ సేఫ్టీ విభాగం ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి బాధితురాలి స్టేట్‌మెంట్ నమోదు చేసి, సాయిప్రసాద్‌కు ముందస్తు బెయిల్ రాకుండా వెంటనే జైలుకు పంపాలని స్పష్టం చేశారు.

ఎమ్మెల్యే మల్ రెడ్డిని వెంటనే అరెస్ట్ చేయాలి

ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి ఆర్టీసీ బస్సులో మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించిన తీరుపై కూడా ప్రవీణ్ కుమార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాప్రతినిధిగా ఉండి మహిళ చేయి పట్టుకోవడం, నడుముపై చేయి వేయడం నేరం కాదా అని ప్రశ్నించారు. ఆయనపై ఐపీసీ 354, 509 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి జైలుకు పంపాలని, మహిళా కమిషన్ వెంటనే ఈ వ్యవహారంపై రియాక్ట్ అయ్యి నోటీసులు జారీ చేయాలని హెచ్చరించారు. మహిళలకు అన్యాయం జరిగితే బీఆర్‌ఎస్ పార్టీ బాధితుల పక్షాన నిలిచి రాజీలేని పోరాటం చేస్తుందని తేల్చిచెప్పారు.

#Telangana#TG News#BRS#Bharat Rashtra Samithi#R S Praveen Kumar#RSP#swechaa news
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి