Smriti Mandhana: టీమిండియా మహిళా జట్టు కెప్టెన్సీ మార్పుపై సోషల్ మీడియాలో జరుగుతున్న ట్రోల్స్‌కు కొత్త కెప్టెన్ స్మృతి మంధాన తనదైన స్టైల్‌లో ఫుల్‌స్టాప్ పెట్టారు. బీసీసీఐతో విభేదాల నేపథ్యంలో హర్మన్‌ప్రీత్ కౌర్ కెప్టెన్సీ నుంచి తప్పుకున్న వెంటనే స్మృతి పగ్గాలు చేపట్టడంతో, వీరిద్దరి మధ్య విభేదాలు వచ్చాయంటూ నెట్టింట పెద్ద ఎత్తున వార్తలు చక్కర్లు కొట్టాయి. ఈ క్రమంలో ఇన్స్టాగ్రామ్ వేదికగా స్మృతి పెట్టిన ఎమోషనల్ పోస్ట్ విమర్శలకూ గట్టి సమాధానమిచ్చింది.
"దాదాపు దశాబ్ద కాలంపాటు మీ సారథ్యంలో ఆడటం నాకెంతో గర్వకారణం. పదేళ్ల పాటు జట్టును మీరు అద్భుతంగా నడిపించారు. ఇకపై కూడా భారత జట్టుకు మరిన్ని చిరస్మరణీయ విజయాలు, దేశానికి గౌరవం తీసుకురావడానికి కలిసికట్టుగా కృషి చేద్దాం" అంటూ హర్మన్‌ప్రీత్‌పై ఉన్న గౌరవాన్ని, ప్రేమాభిమానాలను స్మృతి చాటిచెప్పారు. తమ మధ్య ఎలాంటి గొడవలు లేవని, మైదానంలో తమ రిలేషన్‌షిప్ ఎప్పటిలాగే దృఢంగా కొనసాగుతుందని ఈ పోస్ట్‌తో తేల్చిచెప్పారు. మరోవైపు సహచర క్రీడాకారిణులు జెమీమా రోడ్రిగ్స్, రిచా ఘోష్ సైతం హర్మన్‌ప్రీత్ కెప్టెన్సీ టాలెంట్, ఆమె చేసిన త్యాగాలను కొనియాడుతూ పోస్ట్‌లు చేశారు.


