Sai Dharam Tej: మెగా హీరో సాయిధరమ్ తేజ్ సినిమాలకి బడ్జెట్ కష్టాలా? అవును ఇప్పుడు ఇదే మాట ఫిల్మ్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. యాక్సిడెంట్‌కి ముందు వరకూ సాయిధరమ్ తేజ్ సినిమాలకి మంచి బిజినెస్ అయ్యేది. బాక్సాఫీస్ వద్ద కమర్షియల్ సక్సెస్‌ను అందుకున్నాయి. కానీ, యాక్సిడెంట్ తర్వాత సాయిధరమ్ తేజ్ కంబ్యాక్ ఇచ్చి విరూపాక్ష చేశాడు. ఈ సినిమా బాగానే ఆకట్టుకుంది.
ఆ తర్వాత, నుంచి ఏ సినిమా పర్‌ఫెక్ట్‌గా సెట్ అవడం లేదు. దాదాపు 2 ఏళ్ళ నుంచి సాయిధరమ్ తేజ్ నటిస్తున్న 'సంబరాల ఏటిగట్టు' మూవీ ప్రొడక్షన్‌లోనే ఉంది. నిర్మాతల దగ్గర బడ్జెట్ లేక ఈ సినిమా ఎప్పటికప్పుడు వాయిదా పడుతూ వస్తోంది. దీనికి, అసలు కారణం డబుల్ ఇస్మార్ట్ వల్ల వచ్చిన నష్టాలేనట. అందుకే, సాయిధరమ్ తేజ్ సినిమా ఎప్పుడు రిలీక్ అవుతుందో ఖచ్చితంగా చెప్పలేని పరిస్థితి.
ఇటీవలే, 2027 సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరిలో రిలీజ్ చేస్తామని మేకర్స్ ప్రకటించారు. అప్పటి వరకూ అన్నీ కార్యక్రమాలను పూర్తి చేసి, ప్రమోషన్స్ జరపడానికి ప్లాన్ చేస్తున్నారు. కానీ, ఇప్పటి వరకూ ఈ సినిమాపై ఎలాంటి బజ్ క్రియేట్ అవలేదు. ఏమాత్రం ఫలితం తేడా వచ్చినా నిర్మాతలకి, డిస్ట్రిబ్యూటర్స్ కి తీవ్రంగా నష్టాలు రావచ్చు. ఇప్పటి వరకూ దాదాపు 90 కోట్ల వరకూ బడ్జెట్ అయినట్టుగా తెలుస్తోంది. ఈ సినిమా ప్రభావం ఇప్పుడు కొత్త సినిమాపై పడనుంది.
సాహు గారపాటి సాయిధరమ్ తేజ్ తో ఒక సినిమాను చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు. అయితే, ప్రస్తుతం సాయిధరమ్ తేజ్ కి మార్కెట్ బాగా తగ్గింది కాబట్టి 30 నుంచి 40 కోట్ల బడ్జెట్ అయితే ప్రాజెక్ట్ ముందుకు సాగుతుందట. లేదంటే, ఈ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయ్యే ఛాన్స్ కూడా ఉన్నట్టుగా ఫిల్మ్ సర్కిల్స్‌లో చెప్పుకుంటున్నారు. "క" సినిమాతో దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న సుజిత్ – సందీప్ ద్వయం ఈ సినిమాను రూపొందించనున్నారు. ఒకవేళ సాహు గనక డ్రాపైతే..మరో నిర్మాణ సంస్థతో చర్చలు జరపాల్సి ఉంటుంది. చూడాలి, మరి ఫైనల్ గా సుజిత్ – సందీప్ ద్వయం దర్శకత్వంలో మెగా హీరో సినిమా ఉంటుందా లేదా.


