UV Creations: ప్రభాస్ స్నేహితులతో నిర్మించిన బ్యానర్ యూవీ క్రియేషన్స్. ఇప్పుడు, ఈ సంస్థ తీవ్ర నష్టాలలో ఉన్నట్టుగా ఫిల్మ్ నగర్‌లో టాక్ వినిపిస్తోంది. ఒకప్పుడు, ఈ సంస్థ నుంచి మంచి హిట్ చిత్రాలొచ్చాయి. ఒక్క హిట్ సినిమా వస్తే వెంటనే రెండు ప్రాజెక్ట్స్‌ను ప్రకటించారు. అలా, యూవీ వారు మీడియం బడ్జెట్ నుంచి పాన్ ఇండియా సినిమాల వరకూ భారీ బడ్జెట్‌తో సినిమాలను నిర్మించారు. ఇప్పుడు కూడా ఈ సంస్థలో నిర్మిస్తున్న సినిమాలున్నాయి.
వాటిలో మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న సోషియో ఫాంటసీ సినిమా విశ్వంభర. మల్లిడి వశిష్ఠ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. దాదాపు, 2 ఏళ్ళ నుంచీ ఈ మూవీ నిర్మాణంలోనే ఉంది. ఈ ఏడాది ప్రారంభంలో రిలీజ్ కావాల్సింది. కానీ, వీఎఫెక్స్ వర్క్ పూర్తి కాకపోవడంతో ఆలస్యం అవుతూ వచ్చింది. అలా, చివరికి ఏకంగా బడ్జెట్ సమస్యలు తలెత్తాయని ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాలలో గుస గుసలు వినిపిస్తున్నాయి.
ఈ ప్రాజెక్ట్ కోసం చూసి చూసి చిరంజీవి కూడా పట్టించుకోవడం మానేసినట్టుగా తెలుస్తోంది. అంతేకాదు, దర్శకుడు కూడా వీఎఫెక్స్ వర్క్ కోసం బడ్జెట్ రాకపోవడంతో ఆ సమయాన్ని కొత్త ప్రాజెక్ట్ మీద పెట్టాలను బాలయ్య కొడుకు మోక్షజ్ఞ ను తెలుగు ఇండస్ట్రీకి పరిచయం చేసే బాధ్యతను భుజాన వేసుకున్నాడు. ఇలా, హీరో-దర్శకుడే విశ్వంభర ప్రాజెక్ట్ నుంచి ఎలాంటి అప్‌డేట్స్ ఇవ్వకుండా సైలెంట్ అవడానికి కారణం యూవీ నుంచి బడ్జెట్ టైట్ అవడం వల్లే అని తెలుస్తోంది.
యూవీ ఇలా నష్టాలలో మునగడానికి కారణం..ఇటీవల కాలంలో వచ్చిన సినిమాలే. భాగమతి పెద్దగా లాభాలు తెచ్చిన సినిమా కాదు. అలాగే, ప్రభాస్ నటించిన రాధే శ్యామ్, సాహో భారీ నష్టాలను మిగిల్చాయి. పక్కా కమర్షియల్ డిజాస్టర్. రీసెంట్ సినిమాలలో కొరియన్ కనకరాజు కాస్త ఊరటనిచ్చింది. బైకర్ కూడా సంస్థకి పెద్దగా లాభాలను తెచ్చింది లేదని ఇండస్ట్రీలో చెప్పుకున్నారు. మరి, ఈ సంస్థ మళ్ళీ ట్రాక్ ఎక్కాలంటే ఖచ్చితంగా ఓ భారీ హిట్ అవసరమే. అది ఎప్పుడో..ఏ హీరోదో ప్రస్తుతానికైతే చెప్పలేము.


